Saturday 28 September 2013

సీమాంధ్రులను యెదవల్ని చేసిన సీ.యం.


అధిష్టానం తెలంగాణను ప్రకటించగానే షాక్ కు గురైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వారం రోజులు మంచం పట్టాడు. వారం తరువాత ఒక ఆలోచన ఫ్లాష్ అయింది. వస్తే కొండ .... పోతే వెంట్రుక ముక్క ..... అనుకొన్నాడేమో! సీమాంధ్ర ఎన్.జి.వో.లను ఎగదోశాడు. ఉధృతంగా ఉద్యమం చేయమన్నాడు. 2009 లాగే కేంద్రం పునరాలోచించుకొంటుందని ఆశించాడు. పది రోజులు గడిచాయి.... ఫలితం లేదు. ఇరవై రోజులు గడిచాయి.... ఫలితం లేదు. ముప్పయ్ రోజులు గడిచాయి.... ఫలితం లేదు. నలబై ..... యాబై ..... అరవై రోజులు గడిచాయి......... ఫలితం లేదు.
ఇక తప్పదు..... అధిష్టానం పట్టుదల చూస్తే జరిగేదేదో జరుగుతుందని అర్థమయింది. కాని "ఫలితం లేదు.... ఇక ఉద్యమం ఆపేయండి" అని సీమాంధ్ర ప్రజలకు ఇప్పుడు చెప్పలేడు. రెండు నెలల పాటు జీతాలు లేక, నానా ఇబ్బందులు పడి నష్టపోయిన ప్రజలను ఇప్పుడు "ఉద్యమం ఆపేయండి" అంటే తాట వొలుస్తారు. సీమాంధ్ర ప్రజలపై పిల్లులు, ఎలుకలపై ప్రయోగం చేసినట్టు చేసి ఫెయిలయ్యాక, రాష్ట్ర విభజన విషయంలో ఇక అధిష్టానానికి సహకరించక తప్పదు. కాని అలా సహకరిస్తే సీమాంధ్ర ప్రజలు నరికి పోగులు పెడతారు. అందుకని అధిష్టానానికి విధేయునిగా సహకరించే బదులు మరో రకంగా సహకరించేందుకు మరో నక్క జిత్తుల ప్లాన్ వేశాడు. ఎలాగూ అధిష్టానాన్ని ఎదిరించిన ఇమేజ్ వచ్చింది. అదే ఇంకా గట్టిగా ఎదిరిస్తే సీమాంధ్రలో హీరో కావచ్చు ..... అధిష్టానానికి, రాష్ట్రపతి పాలన పెట్టి వారి పని మరింత సులువయ్యేందుకు మార్గం ఏర్పర్చవచ్చు. ఇన్నాళ్ళు ఎవరినీ  రిజైన్ చేయకుండా ఆపినందుకు ఎలాగూ.... లోపాయకారిగా అధిష్టానం వద్ద మార్కులు  పడ్డాయ్. అంతగా అయితే .. తాను  లోపాయకారిగా  రాష్ట్రపతి పాలనకు కూడ సహకరించిన విషయం తరువాత అధిష్టానానికి వివరించి ప్రసన్నం చేసుకోవచ్చు.  
ఇంతకీ యెదవలయ్యింది ఎవరు? సీమాంధ్ర ప్రజలు! వాళ్ళు నిజంగానే యెదవలే .... ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ ముఖ్యమంత్రిని హీరో అని నమ్ముతున్నారు.     

    

Monday 23 September 2013

సీమాంధ్రులు ఈ పాటను చూసి, విని అర్థం చేసుకోవాలి!

అధర్మ "సమైక్యాంధ్ర ఉద్యమం" చేస్తున్న సీమాంధ్రులు ఈ పాటను చూసి, విని అర్థం చేసుకోవాలి. వ్యాపార దృష్టితో స్వార్థం పెరిగి, ధర్మాధర్మ విచక్షణ కోల్పోతున్నవాళ్ళకు ఈ పాట కొంతైనా కనువిప్పు కలిగిస్తుంది. పాటకై ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి.

http://www.youtube.com/watch?v=3NoIbeMeuvA


Friday 20 September 2013

అయిపాయె..! ఇంకేమున్నది....?


తెలంగాణ నిర్ణయాన్ని కేంద్రం ఆమోదించింది : చాకో
న్యూఢిల్లీ: ‘తెలంగాణ ఏర్పాటుపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదు’ అని ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో అన్నారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ నిర్ణయంపై వెనక్కి వెళ్లే ఆలోచనలేదని స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించిందని వివరించారు. ఇరు ప్రాంతాల్లో పరిస్థితిని చక్కదిద్దుతామని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు చేస్తే సీమాంధ్ర నేతలు రాజీనామాలకు సిద్ధపడుతున్నట్టు సమాచారం ఉందని విలేకరులు ప్రస్తావించగా...ఉద్యమాల ఒత్తిడితో వాళ్లు రాజీనామాలకు సిద్ధపడి ఉండొచ్చని వ్యాఖ్యానించారు.


Wednesday 18 September 2013

తెలంగాణవాదం పల్లెపల్లెకు ఎలా పాకిపోయిందంటే..

తెలంగాణవాదం పల్లెపల్లెకు ఎలా  పాకిపోయిందో తెలుసుకోవాలంటే ఈ కింది లింకును క్లిక్ చేయండి.

http://www.youtube.com/watch?v=D8kbRA4IJ0k



Sunday 15 September 2013

సీమాంధ్రులు అబద్ధాలకోరులు.. దోపిడీ దొంగలు... ఇప్పుడు ఇంకా సిగ్గు లేకుండా తమ దోపిడీ కొనసాగాలని ఉద్యమిస్తున్న అధర్మ ప్రవర్తకులు....

తెలంగాణ ఉద్యమం జరుగుతున్నన్ని నాళ్ళు ... తెలంగాణ ఉద్యమకారులు "సీమాంధ్రులు మా నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు దోస్తున్నారు"  అంటుంటే -
సీమాంధ్రులు "తెలంగాణ ఉద్యమం అబద్ధాల పునాదులపై నిర్మించబడింది -
1. నీరు పల్లమెరుగు .. తెలంగాణ ఎత్తులో ఉంది. సహజంగా మాకు నీళ్ళు వస్తాయి .. ఇందులో మేము దోచిందేమీ లేదు.
2. నిధులు మేమేమి దోచడం లేదు. ప్రభుత్వం ఎప్పుడు ఎక్కడ అవసరమయితే అక్కడ ఖర్చు చేస్తుంది.
3. ఉద్యోగాలు మేమేమి దోచలేదు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు లేనే లేవు. ప్రైవేట్ ఉద్యోగాలు మెరిట్ ప్రాతిపదికన లభిస్తాయి." అంటూ చెప్పుకొచ్చారు.

ఇలా చెప్పుకొచ్చిన వాళ్ళే మరి ఇప్పుడు రాష్ట్రాన్ని విభజిస్తే .. మాకు నీళ్ళు రావంటున్నారు.
ఎందుకు రావు? నీరు పల్లానికి ప్రవహించడం మానుకొంటుందా? లేక .. తెలంగాణ పల్లానికి దిగిపోతుందా?
అంటే.. ఇన్నాళ్ళూ నీళ్ళను అక్రమంగా దొబ్బి బుకాయించినట్టుగా బాజాప్తాగా ఒప్పుకొంటున్నట్టేగా!

రాబోయే తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రాజెక్టులు కట్టి తమ ప్రాంతానికి న్యాయం చేసుకొంటుందో .. సీమాంధ్ర పాలకులు సమైక్య రాష్ట్రంలో.. కేవలం తమ ప్రాంత స్వార్థం కోసమే, కావాలనే ఆ ప్రాజెక్టులను కట్టకుండా అక్రమంగా నీళ్ళు దోచుకొన్నారని సిగ్గు.. లజ్జ.. లేకుండా ఒప్పుకొన్నట్టేగా!  

సీమాంధ్రులు సమైక్య రాష్ట్రంలో నిధులు దోచకుండా ఉన్నట్టయితే.. ఇప్పుడు తెలంగాణ వేరయితే.. మేం గడ్డి తిని బతకాల్సి వస్తుందని, నిరసనగా గడ్డి తింటూ ప్రదర్శనలు చేస్తున్నారెందుకు సిగ్గు లేకుండా....?

సీమాంధ్రులు ఇప్పుడు రాష్ట్రాన్ని విభజిస్తే .. మాకు ఉద్యోగాలు రావంటున్నారు. 
సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పడితే.. లేవనుకొన్న ప్రభుత్వ ఉద్యోగాలు అక్కడ కొన్నైనా వస్తాయి. ఇక హైదరాబాదు ప్రైవేట్ ఉద్యోగాలు ఎలాగూ మెరిట్ ప్రాతిపదికన లభిస్తాయి. ఇక వాళ్ళకొచ్చిన నష్టమేమిటి? అంటే ఇన్నాళ్ళూ చెప్పిందంతా అబద్ధమన్నట్టేగా! అక్రమంగా, ప్రాంతీయ పక్షపాతంతో సీమాంధ్రులు ఉద్యోగాలు దొబ్బినట్టుగా సిగ్గు.. ఎగ్గు.. లేకుండా ఒప్పుకొన్నట్టేగా!  

తెలంగాణ వాళ్ళు కష్టమో.. నష్టమో.. మా బతుకులు మేము బతుకుతామంటున్నారు. కాని సీమాంధ్రులు అలా కాదు. వాళ్ళు ఎప్పుడూ పరాన్నభుక్కులే. ఆనాడు తమిళుల మీద పడితే.. వాళ్ళు తన్ని తగిలేశారు. ఇప్పుడు తెలంగాణ విడిపోతే మేం బతకలేమంటున్నారు. ఆనాడు మద్రాసును, ఈనాడు హైదరాబాదును మేమే అభివృద్ధిని చేశామనే వీళ్ళు.. ఇప్పుడెందుకు ఇంత చతికిలబడుతున్నారు. దీన్ని బట్టి తెలియడం లేదా?  వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటో! వీళ్ళపై వీళ్ళకు ఉన్న ఆత్మ విశ్వాసం ఎంతో!! ఇంత దుర్బల జాతిని ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. ఇంత దౌర్బల్యం ఉన్నవాళ్ళు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను భాష.. సంస్కృతి.. అంటూ ఎందుకు చిన్న చూపు చూశారు. అహంకారంతో ఎందుకు అవహేళనలు చేశారు? తెలంగాణ విడిపోతె బతకలేమనుకొన్న వారు ఎందుకు అణకువగా ఉండి ఆ ప్రాంత ప్రజల ప్రేమను సంపాదించుకోలేదు. ఈ రోజు ఏ తెలంగాణ పౌరుణ్ణైనా అడిగి చూడండి. సీమాంధ్రుల ఈసడింపులు, వెటకారాలు, కుటిలత్వాల గురించి పుంఖానుపుంఖాలుగా వివరిస్తారు.

ప్రపంచంలో ఎక్కడయినా "మాకు స్వేచ్చ కావాలి" అని ఉద్యమిస్తారు. కాని ఎదుటి వాడికి స్వేచ్చ ఇవ్వరాదని పోరాడరు. పైగా ఆత్మాభిమానంతో.. "పోతే ఫోండి.. మీకు లేనప్పుడు మాకేంటి?" అంటారు.  కాని సిగ్గు.. ఆత్మాభిమానం.. చంపుకొని, దౌర్జన్యకారుల్లాగా "మీరు చచ్చినట్టు మాతో కలిసి ఉండాలి" అనరు. 

ఇప్పుడు సీమాంధ్రుల ’సమైక్య ఉద్యమం’ చూసి ప్రపంచమంతా నవ్వుకొంటోంది. ఈ ఉద్యమం ద్వారా సీమాంధ్రులు తమను తాము - "అబద్ధాలకోరులు.. దోపిడీ దొంగలు... ఇంకా సిగ్గు లేకుండా తమ దోపిడీ కొనసాగాలని ఉద్యమిస్తున్న అధర్మ ప్రవర్తకులు...." అని చాటుకొంటున్నారు.

Thursday 5 September 2013

సిగ్గు.. షరం.. ఉన్నవాళ్ళయితే!!!

విషయం ఇంతవరకు వచ్చింది కాబట్టి ....
మాకూ ఔదార్యం అక్కర్లేదు. మేమూ నిక్కచ్చిగానే మాట్లాడుతాం.

సీమాంధ్రులకు ఉమ్మడిగా  హక్కుండేది హైదరాబాదు ప్రభుత్వ ఆస్తుల పైనే.
ఎందుకంటే ఏ ప్రభుత్వాలు మారినా.. ఏ రాష్ట్రాలు ఏర్పడినా.. ప్రైవేట్ ఆస్తుల పైన హక్కు ఆ యా వ్యక్తులకు లేదా సంస్థలకే ఉంటుంది.
హైదరాబాదు మీద మాకు హక్కుందనే సీమాంధ్రులకు కనీసం ఈమాత్రం ఇంగిత జ్జానం ఐనా ఉండాలి.

అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి పన్నులతో, ఉమ్మడి ప్రభుత్వ ఆదాయంతో 1956 నుండి 2013 వరకు అభివృద్ధి చెందిన విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి నగరాలపై తెలంగాణ ప్రజలకు హక్కుంది.
సిగ్గు.. షరం.. ఉన్నవాళ్ళయితే....
5 నగరాల అభివృద్ధిలో మా వాటా ఎంతో తేల్చండి.
ఆ పైన హైదరాబాదులో మీ వాటా ఎంతో లెక్కలు తేల్చండి.
చెల్లుకు చెల్లు.... హళ్ళికి హళ్ళి ....
హైదరాబాదును యూటీ చేస్తే పై 5 నగరాలనీ యూటీలుగా మార్చాలి.

మాది మాకే.. మీదీ మాకే అనే సిగ్గు.. షరం.. లేని బతుకులు మీవి కాబట్టే మేమ్ మీతో కలిసుండలేమనేది

విడిపోయేప్పుడు కూడా అవే చిల్లర బుద్ధులా