Tuesday 30 July 2013

ఫలించిన జోస్యం


03-05-2013 నాడు ఈ బ్లాగులో ప్రచురించిన పోస్టును ఈ క్రింది లింక్ ద్వారా చూడండి.
అప్పటికి కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ దిశగా అడుగులు వేసిన దాఖలాలు కూడ లేవు. పైగా ఈ జోతిష్య సమాచారం గత మూడు నాలుగేళ్ళుగా ఇంటర్నెట్ లో దర్శనమిస్తోంది. అదంతా అక్షర సత్యంగా ఇప్పుడు ఫలిస్తోంది.
ఇలాంటివి చూసినప్పుడే జోతిష్య శాస్త్రంపై నమ్మకం పెరుగుతుంది. జోతిష్య శాస్త్రవేత్తలు ఫెయిల్ అవవచ్చు గాని, సమర్థుడైన జోతిష్య శాస్త్రవేత్త చెప్పిన జోతిష్య శాస్త్రం ఫెయిల్ అవ్వదు అనడానికి ఇది ఒక ఉదాహరణ. పై జోతిష్య సమాచారం అందించిన ఆ శాస్త్రవేత్త ఎవరో .... ఆయనకు పాదాభివందనాలు! 

http://pannagashayi.blogspot.in/2013_05_01_archive.html

Monday 29 July 2013

కుక్క కాటుకు చెప్పు దెబ్బ - 2

ఇటీవల "మనవు" అన్న బ్లాగులో రాసిన ఒక పోస్ట్లో ప్రతి మాటా అక్షర సత్యం.
ఆ పోస్ట్ ఇది ....

"సోనియా గాంది, తన పుట్టిన రోజు కానుకగా ఇచ్చిన దానిని వెనుకకు తీసుకుంటుందా !?

                                                                          



K.C.R. గారు ఆంద్రా నాయకులను తెలివిగా అడకత్తెర లో ఇరికించి తెలంగాణా రాష్ట్ర సాధనకు కారకుడయ్యాడు అని చెప్పవచ్చు. తెలంగాణా వారు  రాజకీయంగా  పావులు కదపటంలో  చాణక్యుడికి ఏ మాత్రం తీసి పొరని K.C.R. నిరూపించాడు . అటు అధిష్టాన దేవతని ప్రసన్నం చేసుకోవడంలో సపలిక్రుతుడు అవ్వడమే కాక , తన చాకచక్యంతో ఆమె నైజం ఎరిగి, కూల్ గా ఆమె చేత తెలంగాణాకు  o.k అనిపించాడు .. కొన్నాళ్ళు సునామిలా విరుచుకు పడుతూ ,మరి కొన్నాళ్ళు వ్యూహాత్మక మౌనం పాటించే  k.c.r. లో అపర చాణక్యుడు ఉన్నాడనటo  లో అతి శయోక్తి లేదు .

  ఏమిటి ! k.c.r. గారిని ఇంతలా పోగుడుతున్నాను అనుకుంటారా? అవును మరి. ఈ రోజున తెలంగాణా రాష్ట్రం ఏర్పడటానికి ఎవరు ఎన్ని కారణాలు చూపించిన ముక్య కారణం సోనియా గాంది గారి మాట. అవును ఖచ్చితంగా ఆమె తెలంగాణా ప్రజలకు తన పుట్టిన రోజు కానుకగా ఇచ్చిన మాటే ఈ రోజు తెలంగాణా ఏర్పడటానికి కారణ మవుతుంది తప్పా వేరేది కాదు. సోనియా గాంది గారి నైజం ఎరిగిన k.c.r. గారు ఆమె పుట్టిన రోజు అయిన డిసెంబర్ 9 వ తారికున తెలంగాణా ప్రకటన చేసేలా చాలా కసరతు చెసాదు. అందులో బాగమే ఆయన గారి పదిరోజుల నిరాహార దీక్ష కదా కార్యక్రమాలు . ఇవ్వన్ని అధిష్టాన దేవత అంగీకారంతో జరిగినవె. ఆ రోజు భారత హోం మంత్రి చేత ప్రకటన చేయించాక ఇక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అయిపొఇదనుకున్నాదు.

   అంతే !అప్పటి దాక తెలంగాణా ఇస్తే మాకేమి అబ్యంతరం లేదని బింకపు మాటలు మాట్లాడిన ఆంద్ర రాజకీయ దిగ్గజాలు ఒక్క సారిగా నివ్వెర పొయారు. అప్పటి దాక తెలంగాణా  ఇవ్వడం అనేది అయోధ్యలో  రామాలయం  కట్టడం లాంటిది అనుకున్న అంద్రా వారు ఒక్కసారిగా ఆంద్రా ప్రజలు నిరసన తెలపడంతో అయోమయానికి గురిఅయి ఒక్క సారిగా మూకుమ్మడి రాజీనామాలు చేసే సరికి  ఈ సారి  తెల్లబోవడం సోనియా గాంది గారి వంతయింది . అదేమిటి ! అంతకు ఒక్క రోజు మునుపే ఒక్క c.p.m. వారు తప్పా ,అందరూ తెలంగాణా ఇస్తే తమకేమి అబ్యంతరం లేదని రాత పూర్వకంగా తెలియ చేసి ,తెల్లారి ఇచ్చేసరికి ఇలా మాట మార్చడం ఇటాలియన్ సోనియా గారికి అస్సలు అర్ధం కాలెదు. ఈ రోత రాజకీయాలు చూసి ఆమెకు అసహ్యం కూడా వేసి ఉండవచ్చు. కాని రాష్ట్ర రాజకీయాలలో అనుబవమున్న వారు ఇచ్చిన సలహాతో కావచ్చు తాత్కాలికంగా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆపి ఉంటారు
      భారత దేశం వంటి పెద్ద దేశానికి చెందిన అదికార పార్టికి ఆమె అధిష్టాన దెవత. ఆమె మాట ఇస్తే తప్పుకునే రకం కాదు.అందులో తన పుట్టిన రోజున నాలుగు కోట్ల మంది ప్రజలకు అందరి ఆమోదం తో ఇచ్చిన మాట అది. అది ఆమె జన్మదినo   నాడు ఇచ్చిన వరం . అటువంటి దానిని ఆమె వెనుకకు తీసుకుంటుందా? తీసుకుని తన చరిత్రలో ఒక మచ్చని ఏర్పర్చుకుoటుందా ? నెవ్వర్! ఇది తెలిసిన వాడు కాబట్టే k.c.r నిమ్మకు నిరేట్టినట్లు ఉంటూ తన పాంహౌస్ లో కాలం గడుతున్నాడు . అది తెలియని వారు డబల్ గేం రాజకీయాలతో ఇంకా ప్రజల్ని మబ్య పెట్టాలని చూస్తున్నారు .. నాన్నా పులి వచ్చె కదలొ కొండయ్య కొడుకు లాగ పిల్ల చేష్టల రాజకీయాలతో ఆటలాడిన రాజకీయ నాయకులు ఇప్పుడు రాష్ట్ర ఏర్పాటును కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు తప్పా , అసలు ప్రజల మనో బావాలు ఏమిటి ? వాటిని తెలియ పరచడంలో పార్టి సంకుచిత ప్రయోజనాలకు అతీతంగా ఎలా వ్యవహరించాలి అనేది ఇప్పటికి వారికి అవగతం అయినట్లు లెదు.  నైతిక విలువలతో  కూడిన రాజకీయాలే మన రాష్ట్రానికి , దేశానికి శ్రీ రామ రక్ష అని రాజకీయ వాదులు గ్రహిస్తే మంచిది . అలా ఒకే మాట మిద వ్యవహరించిన  T.R.S.,C.P.M, పార్టీలకు అభినందనలు . డబల్ గేం రాజకీయ నేతల నైజంతో ప్రజల మనో బావాలు సరిగా వెల్లడి కావు అనటానికి చరిత్రలో ఒక గొప్ప ఉదాహరణ గా మిగిలి పోనుంది తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు. ఇప్పటి కైనా ప్రజలు మాటలు చెప్పే వారిని కాక మాట మిద నిలబడే వారిని ఆదరిస్తే సర్వ విధాలా శ్రేయో స్కరమ్."    
("మనవు" బ్లాగు ఓనర్ కు ధన్యవాదాలతో .....)


సీమాంధ్ర పార్టీల, ఆయా పార్టీల నేతల ద్వంద్వ నీతికి కాంగ్రెస్ అధిష్ఠానం తగిన బుద్ధి చెప్పింది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ!!!

Sunday 28 July 2013

కుక్క కాటుకు చెప్పు దెబ్బ - 1


అనేక ఒప్పందాల, జీ.వో.ల ఉల్లంఘననను నిరసిస్తూ,
అరవై ఏళ్ళుగా నిధులు, నీళ్ళు, ఉద్యోగాల పంపకంలో జరుగుతున్న వివక్షను అంతం చేయడానికి
అస్థిత్వ వాదం, ఆత్మ గౌరవం, ప్రజల ఆకాంక్ష అనే ప్రజాస్వామిక అంశాలతో
తెలంగాణవాదులు ఉధృతంగా జరిపిన ఉద్యమ ఫలితంగా
ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే....
సీమాంధ్ర నాయకులు ఓట్లు, సీట్లు, పార్టీ ప్రయోజనాలు అంటూ దొంగ లెక్కల కారణాలు చూపి అడ్డుకొన్నారు. ఇప్పుడు అదే ఓట్లు, సీట్లు, పార్టీ ప్రయోజనాల లెక్కలే చూపుతూ
కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనకు పూనుకొని అప్రతిహతంగా ముందుకు సాగిపోతోంది.
పాపం సీమాంధ్ర నాయకులు! ఇప్పుడేం చేస్తారు?
"కుక్క కాటుకు చెప్పు దెబ్బ" అంటే ఇదే!

Wednesday 24 July 2013

తెలంగాణలో సామాన్య ప్రజల హృదయ వాణి!!!

"ఆడు తెస్తడొ .... ఈడు తెస్తడొ ....
అవ్వ ఇస్తదొ .... అయ్య ఇస్తడొ ...
ఎవ్వడిచ్చేదేందిరా ?
ఇది ఎవ్వని జాగీరురా ?"

ఇది తెలంగాణలో సామాన్య ప్రజల హృదయ వాణి.

ఆ వాణిని తన బాణిలో వినిపించి జోహారులందుకున్న "ఉదయ భాను" పాటను ఈ క్రింది లింకును క్లిక్ చేసి చూడండి.

నీళ్ళను(గంగ) దోచుకెళుతున్న గద్దలను(గరుడాలు) నిరసిస్తూ పాడిన ఆ పాట ....
"గంగ గరుడాలెత్తుకెళ్ళేరా...."

http://manaserials.com/?url=SVO2HrBB9nU&source=youtube

Friday 19 July 2013

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యం!!!

ఊహాగానాలు, స్వీయ కల్పనలు వ్రాసే పత్రిక కాదది. ఏ వార్తైనా ఒకటికి పదిసార్లు సత్యమని నిర్ధారణ చేసుకొన్నాకే ప్రచురించే పత్రిక ’హిందు’ ఆంగ్ల దిన పత్రిక. అలాంటి ప్రతిష్ఠాత్మక పత్రిక తన హెడ్ లైన్స్ వార్తగా నిన్న ప్రచురించిన ఈ క్రింది విషయం ఇంకా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో అనుమానాలున్న వారి అనుమానాలను పటాపంచలు చేసింది.



New Delhi, July 19, 2013
Telangana looks certain
Smita Gupta
Talks on Hyderabad's status on
The UPA government has decided to honour the commitment it made on December 9, 2009 to carve out a separate State of Telangana from Andhra Pradesh, senior party and government sources told The Hindu .
“The die is cast,” a government source said, “as far as the creation of Telangana is concerned,” even though last-minute consultations continue on the ultimate status of Hyderabad and whether two districts of Kurnool and Anantapur from the Rayalaseema region should be added to Telangana to create two States, with 21 Lok Sabha seats apiece.
The key issue, of course, is to address the apprehensions of those from the Andhra and Rayalaseema regions who have, over the years, made substantial investments in Hyderabad, geographically located within the Telangana region.
One suggestion is to make Hyderabad a union territory for a period of 10 years, with land, law and order and, perhaps the civic bodies, under the overall supervision of the Lt. Governor, the representative of the Centre, as in the case of Delhi.
Three reasons eventually weighed in favour of Telangana. One, in the event of a BJP-led NDA coming to power and it announcing that it will divide Andhra Pradesh, the Congress would have to support it: it makes more sense, therefore, to carve out a new State and take the credit for something that it had announced it would do in 2009. Two, the Congress did not eventually want to be seen as going back on a commitment it had made publicly.
Three, electoral considerations: by creating Telangana, the Congress will not only ensure it neutralises the Telangana Rashtra Samiti and deprive the BJP, which has announced its support for the T project, of an election issue, but it would also be in a position to win a majority of the 17 Lok Sabha seats in the region, along with the TRS.



Monday 15 July 2013

మరో అడుగు ముందుకు.......

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశలో ఢిల్లీలో మరో అడుగు ముందుకు పడుతున్నది.
అందుకు సాక్ష్యం "ఆంధ్ర భూమి" దినపత్రికలో వచ్చిన ఈ వార్తే.


Tuesday 9 July 2013

ఒక్కో అడుగు ముందుకు పడుతోంది


అది దేశంలోని పది ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటి. దశాబ్దాలుగా అక్కడ చదువుకున్నలక్షలాది విద్యార్థులు దేశంలో అనేక రంగాల్లో అనేక ఉన్నత పదవులను సమర్థంగా నిర్వహించి దేశానికే వన్నె తెచ్చారు. చాలామంది విదేశాలకు వెళ్ళి తమ ప్రతిభను చాటి మన దేశం కీర్తి పతాకను ఎగురవేశారు. 
ఇదంతా ఒక ఎత్తు. చదువుతోబాటు ఆ విద్యార్థులు దశాబ్దాలుగా ఒక మహోన్నత ఉద్యమాన్ని కూడా నడుపుతున్నారు. తరాలు మారుతున్నాయి. ప్రతి సంవత్సరం పాత విద్యార్థులు వెళ్ళిపోతుంటారు. కొత్త విద్యార్థులు జాయిన్ అవుతుంటారు. కాని ఉద్యమం మాత్రం ఆగదు. యూనివర్సిటీని వదలి వెళ్ళేముందు సీనియర్లు జూనియర్లకు ఉద్యమ సారథ్య బాధ్యతలను అప్పగించి వెళ్తారు. జూనియర్లు అంతే కర్తవ్యదీక్షతో దాన్ని ముందుకు తీసుకెళ్తారు.1969 కంటే ముందునుండి ఏదొ ఒక రూపంలో ఆ విద్యార్థులు నడుపుతున్న ఆ ఉద్యమం కాస్త హెచ్చుతగ్గులున్నా, గత దశాబ్దం నుండి మహోధృతంగా సాగుతోంది. అయినా చదువులో ఆ విద్యార్థుల ర్యాంకులు తగ్గవు. ఆ విశ్వవిద్యాలయం స్థాయి, ర్యాంక్ దిగజారదు. అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్సుల్లో ఇతర విశ్వవిద్యాలయ విద్యార్థుల కంటె వాళ్ళే ఎక్కువగా రాణిస్తారు. సవ్యసాచుల్లా చెలరేగే ఆ విద్యార్థులు నడిపే ఆ ఉద్యమం తెలంగాణ ఉద్యమం. ఆ విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం.
వాళ్ళు ఇతర విశ్వవిద్యాలయ విద్యార్థుల్లా గతంలో ఒకసారి రాష్ట్రాన్ని విడగొట్టాలని, ఇప్పుడేమో సమైక్యంగా ఉంచాలని ఉద్యమించే అవకాశవాదులు కారు. దశాబ్దాలుగా వారి లక్ష్యం ఒక్కటే. మా తెలంగాణ రాష్ట్రం మాకు కావాలె అన్నదే వారి ఆశయం. ఆ ఆశయ సాధనకై 1969 లో నాలుగు వందల మంది పోలిసు ఫైరింగుల్లో బలి అయ్యారు. గత నాలుగేళ్ళుగా వెయ్యిమంది విద్యార్థులు స్వీయ బలిదానాలు చేశారు. లాఠీ దెబ్బలకు రక్తాలను కార్చారు. రబ్బరు తూటాలను తిన్నారు. బాష్పవాయు గోళాలకు ఎదురొడ్డి నిలిచారు. ఎన్నో రకాల కొత్త కొత్త ఉద్యమ నిరసనలను, కార్యక్రమాలను కనుగొని ఆచరించి చూపారు. అవసరమయినప్పుడు రాజకీయాలలో తలపండిన వాళ్ళనే శాసించారు. కంటికి కునుకు లేకుండా చేశారు. వారి ధీరత్వానికి త్యాగశీలతకు ప్రపంచ ప్రజలు, మేధావులు, పరిశీలకులు ఆశ్చర్యంతో జేజేలు పలుకుతున్నారు. వారి ఉద్యమ పంథాపై కొన్ని విదేశ విశ్వవిద్యాలయాల్లో పి.హెచ్.డి.లు చేస్తున్నారు. ఇన్నాళ్ళకు వారి ఉద్యమశ్రమ ఫలించే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈనాడు దినపత్రికలో వచ్చిన ఈ వార్తే అందుకు సాక్ష్యం. జయహో ఉస్మానియా విద్యార్థి వీరులారా! జయహో! జయహో!