Friday 7 March 2014

ఎంత అన్యాయం?

దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను అర్థం చేసుకోడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. సచివాలయంలో ఉన్నతాధికారుల పంపకాల సందర్భంగా బయల్పడిన గణాంకాలు ఇవి. ఎంత అన్యాయం?

Tuesday 18 February 2014

అభివందనాలు!


వివక్షకు విరుగుడు విభజనే అని చైతన్య పరచి,
ప్రలోభాలకు లొంగక, పదవులను తృణప్రాయంగా కాలదన్ని,
పద్నాలుగేళ్ళపాటు అవిష్రాంతంగా పోరాడి,
విజయలక్ష్మిని తెలంగాణ ప్రజలకందించిన
ఉద్యమ రథ సారథి -
శ్రీ కలువకుంట్ల చంద్రశేఖరరావు గారికి
అభివందనాలు!

Saturday 15 February 2014

SHAME! SHAME!

http://www.youtube.com/watch?v=iQWsurWtNFY#t=339










ఇప్పుడు దునియా మొత్తం ఎరుకైంది ...వీళ్ళ దౌర్జన్యం ఎట్లుంటదో ...
వీళ్ళతోని తెలంగాణ ఎందుకు విడిపోవాలనుకొంటున్నదో! ....

షేం ... షేం ... షేం...!

Friday 7 February 2014

ధర్మయుద్ధ విజేత


రాష్ట్రపతిభవన్ లో రాష్ట్రపతితోబాటు నీరాజనాలను అందుకొంటున్న తెలంగాణ రాష్ట్రపిత  KCR.

Sunday 26 January 2014

నాన్నాసమైక్యవాదంఅంటే?

నాన్నాసమైక్యవాదంఅంటే?(ఫేస్ బుక్ లో తెలంగాణ వాదులు రాస్తున్న పోస్టులలో ఒక 

సృజనాత్మకమైన పోస్ట్ ను మీ కందిస్తున్నాం. Dharani Kulakarni అనే నెటిజన్ తన 

పోస్టింగ్ లో సమైక్యవాదంలోని డొల్లతనాన్ని బయటపెట్టారు.)--------------------------


నాన్నాఎక్కడికెళ్ళావ్?

సమైక్యవాదులమీటింగుకెళ్ళాను.

సమైక్యవాదంఅంటే?

అందరూకలిసిఉండాలని...

అంటేఅందరూమనఇంట్లోఉంటారా?

లేదు, ఎవరింట్లోవాళ్ళేవుంటారు.కాకపోతేఅందరూఒకేరాష్ట్రంలోవుండాలని...

ఒకేరాష్ట్రంఅంటే?ఈదేశంమొత్తంఒకేరాష్ట్రంగావుండాలనా?

కాదు,ఈదేశంలోతెలుగుమాట్లాడేవాళ్ళందరూఒకేరాష్ట్రంగావుండాలని.

అంటేహిందీమాట్లాడేవారుకూడాఒకేరాష్ట్రంగావుండాలా?

కాదు.హిందీమాట్లాడేవారువేరువేరురాష్ట్రాలుగాఉండవచ్చు.తెలుగుమాట్లాడేవారేఒకేరాష్ట్రంగావుండాలి.

హిందీమాట్లాడేవారువేరువేరురాష్ట్రాలుగావున్నప్పుడుతెలుగుమాట్లాడేవారుకూడావేరువేరురాష్ట్రాలుగాఎందుకువుండకూడదు?

ఎందుకంటే... మొన్నహైదరాబాదువెళ్లాంచూసావా?అప్పుడుఅక్కడచార్మినార్, గోల్కొండచూసిమాహైదరాబాద్, మాచార్మినార్,మాగోల్కొండఅనుకున్నాం. మరిరాష్ట్రంవేరుగావుంటేఅలాఅనుకోవడానికివీలుకాదుగా!

ముంబాయివెళ్ళినప్పుడుకూడాఅన్నీచూసిమనముంబాయిఅనుకున్నాంగాడాడీ?

అదికాదమ్మా.అక్కడమనవాళ్ళుడబ్బులుపెట్టుబడిపెట్టివ్యాపారాలుచేస్తున్నారు.రాష్ట్రంవిడిపోతేవారికిఇబ్బందిఅవుతుందికదా?

ఎవరుడబ్బులుపెట్టారు?మనతాతయ్యా?మామయ్యా?

కాదు.

మరెవరు?

లగడపాటి, కావూరి, తిక్కవరపు, రాయపాటి, మేకపాటిఅనీ...

వాళ్ళెవరు?మనచుట్టాలా?

కాదు!

మరిమనకెందుకు?వాళ్ళడబ్బులగురించివాళ్ళుచూసుకుంటారుగా?

నీకుతెలియదులే, వెళ్లిఆడుకోఫో!

Saturday 18 January 2014

నాడు "విభజనే న్యాయం!" .. నేడు "విభజన అన్యాయం!!" - రెండు మూతుల పాములు!!!













అవకాశవాదంతో తాము ఎప్పుడు ఏమైనా మాట్లాడొచ్చు. తెలుగుతల్లి గుడ్డిది అని వీళ్ళ భావన. కాని అదే తెలుగుతల్లి ఆనాటి వీళ్ళ కోరికను ఇప్పుడు తీరుస్తున్నది.




Saturday 11 January 2014

సీమాంధ్రులు ఏం సమాధానం చెబుతరు?

ఈటెల తూటాలు


-అసెంబ్లీలో భావోద్వేగ ప్రసంగం-మా కన్నీళ్ళతో చెలగాటం తగదు..-ఈ బిల్లు.. అమరుల త్యాగఫలం.. వారి రక్తం ఇందులో ఉంది-ఖురాన్, బైబిల్, భగవద్గీతలా మాకు ఇదెంతో పవిత్రం-ముసాయిదాపై చర్చలో టీఆర్‌ఎస్‌ఎల్పీనేత ఈటెల రాజేందర్-అరవైఏళ్లుగా తెలంగాణకు అన్యాయాలు-ఒప్పందాలన్నీ బుట్టదాఖలయ్యాయి-ఎన్నడూ ఒక్క జీవో అమలుకాలేదు-భరించలేకే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం-ఇంకా అవకాశవాదం ప్రదర్శించకండి-నిజాయితీతో మాకు మద్దతు పలకండి-రెండు జీవనదులున్నా.. వాటా దక్కట్లేదు-చదువులూ చట్టుబండలు చేశారు-తెలంగాణలో పరిశ్రమలు మూసివేశారు-ఇక్కడి భూములమ్మినా.. పైసా ఖర్చు పెట్టలేదు-సొమ్ము మాది.. సోకు మీదా?


హైదరాబాద్, జనవరి 10 (టీ మీడియా):‘వెయ్యి మంది అమరవీరుల త్యాగఫలితం ఇది.. అరవై ఏళ్ల పోరాటాలకు ప్రతిరూపం ఇది. బిల్లులో అమరవీరుల రక్తం ఉంది. వారిని కన్న తల్లుల ఆవేదన ఉంది. మన చేతికి నిప్పు తగిలితే అమ్మా.. అని అంటాం. కానీ.. ఎల్బీనగర్ చౌరస్తాలో శ్రీకాంతచారి ఒంటిపై పెట్రోలు పోసుకుని మంటల్లో ఉన్నా.. జై తెలంగాణ అని నినదించాడు. ఉస్మానియా యూనివర్సిటీలో యాదయ్య మంటల్లో కాలిపోతూ జై తెలంగాణ అంటూ నినాదం చేశాడు. అమరుల త్యాగాలు ఢిల్లీ పెద్దలకు వినిపించడం లేదని ఢిల్లీ పెద్దలకు లేఖ రాసిన యాదిరెడ్డి పార్లమెంటుకు కూతవేటు దూరంలో ఉరేసుకున్నాడు. ఇలాంటి వెయ్యిమందికిపైగా అమరవీరుల త్యాగాలు ఈ బిల్లును తెచ్చాయి. క్రైస్తవులకు బైబిల్, ముస్లింలకు ఖురాన్, హిందువులకు భగవద్గీత ఎంత పవిత్రమైనదో.. మాకు ఈ ముసాయిదా బిల్లు అంత పవిత్రమైనది. అలాంటి బిల్లును మీరు చించివేశారు. కాల్చి బూడిద చేశారు.
etelaఇదేనా మీ సంస్కారం?’ అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ సీమాంధ్ర నేతలను, తెలంగాణ వ్యతిరేకులను ప్రశ్నించారు. రాష్ట్రపతి నుంచి వచ్చిన ముసాయిదా బిల్లుపై శుక్రవారం అసెంబ్లీలో చర్చలో పాల్గొంటూ ఆయన భావోద్వేగ ప్రసంగం చేశారు. తెలంగాణ ఎందుకు కావాలో విడమర్చి చెప్పారు. తెలంగాణకు జరిగిన అన్యాయాలను రికార్డులను ప్రస్తావిస్తూ సభాసాక్షిగా ప్రజల ముందు పెట్టారు. జరిగిన ఒప్పందాలు ఎలా ఉల్లంఘనకు గురయ్యాయో వివరించారు. ఒక్క 610 జీవో అమలు కోసం వందలసార్లు సభలో విజ్ఞప్తి చేసిన విషయాన్ని ప్రస్తావించిన ఈటెల.. ఆ ఒక్క పనికూడా చేయలేకపోయిన సమైక్యరాష్ట్రంలో ఎలా కలిసుండాలని నిగ్గదీశారు. అన్నదమ్ముల్లా విడిపోదాం, ఆత్మీయులుగా కలిసి ఉందామని తాము కోరుకుంటుంటే, మీరు వెకిలిచేష్టలతో రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వీటిని భరించలేకే తెలంగాణ సమాజం దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిందన్న ఈటెల.. అడ్డదారులు తొక్కి, పచ్చి అవకాశవాదాన్ని ప్రదర్శించడం తగదని సీమాంధ్ర నేతలకు హితవు పలికారు. నిధులు.. నీళ్లు.. నియామకాల కోసమే తమ ఉద్యమం సాగిందన్న ఈటెల.. ఆకలి కేకలు, ఆత్మహత్యలు లేని రాష్ట్రం కావాలని తెలంగాణ అంతా ఒక్కటే కొట్లాడుతుంటే కుట్రలు, కుతంత్రాలతో అడ్డుకుంటూ వస్తున్నారని విమర్శించారు. మా కన్నీళ్ళతో చెలగాటం ఆడకుండా.. విజ్ఞతతో వ్యవహరించి.. నిజాయితీని ప్రదర్శించుకోవాలని విన్నవించారు. గతంలో పార్టీలు ఇచ్చిన లేఖలకు, ఎన్నికల మేనిఫెస్టోలకు కట్టుబడి ముసాయిదా బిల్లుపై అభిప్రాయాలు చెప్పాలని సీమాంధ్ర ఎమ్మెల్యేలను కోరారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో అత్యధిక మంది ఎంపీల ఆమోదంతో రికార్డు స్థాయి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆద్యంత ఉద్వేగభరితంగా.. ఈటెల్లాంటి మాటలతో.. చురకత్తుల్లాంటి చురకలతో.. ఆగ్రహంతో.. ఆర్థ్రతతో.. సంయమనంతో.. సోదరభావంతో నిండిన ఈటెల ప్రసంగం ఇలా సాగింది.
ఇది 56 ఏండ్ల నిరీక్షణ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నూటికి నూరు శాతం మంది తెలంగాణ బిడ్డల మద్దతు ఉంది. రాష్ట్రం కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చించే అవకాశం లభించటం సంతోషం. ప్రజాస్వామ్యబద్ధంగా విడిపోదాం. ఆంధ్ర, రాయలసీమలోని అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల ప్రజలు విభజనకు అనుకూలంగా ఉన్నారు. కొందరికి రాష్ట్ర విభజన అర్థం కావటం లేదు. మరికొన్ని వర్గాలకు అర్థం అయినా గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయి. దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్నారు గురజాడ. కానీ ఆంధ్రా పాలకులకు తెలంగాణలో ఆక్రమించుకున్న భూమి మీదనే వారి ప్రేమంతా. వట్టి మాటలు కట్టి పెట్టోయ్.. గట్టి మేలు తలపెట్టవోయ్ అన్నారు గురజాడ. కానీ సీమాంధ్ర పాలకులు ఇన్నేళ్ళు అభివృద్ధి అనే మాటలు చెబుతూ వచ్చారే కానీ.. ఎన్నడూ తెలంగాణను అభివృద్ధి చేద్దామనే ఆలోచన చేయలేదు. రాహుల్‌గాంధీని ప్రధాని చేసేందుకే రాష్ట్ర విభజన చేస్తున్నారని మాట్లాడుతున్నారు. రాజకీయ ప్రయోజనాలు ఉండవచ్చు గాక! కానీ మూడు తరాల ఆకాంక్ష తెలంగాణ ఉద్యమం. 1956లో సమైక్యరాష్టం ఏర్పాటుకు ముందే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం జరిగింది. అప్పుడే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు తెలంగాణ రక్తసిక్తమయింది. జయశంకర్ సార్.. ఎప్పుడూ అనే వాడు.. ‘హైదరాబాద్ సిటీ కాలేజీలో మీటింగ్‌కు హాజరయ్యేందుకు వరంగల్ నుంచి బస్సులో వస్తున్నాం. కానీ బస్సు చెడిపోయిన కారణంగా సమావేశానికి హాజరుకాలేదు. హాజరయితే నేను అక్కడ జరిగిన కాల్పుల్లో చనిపోయే వాడిని’ అని.

బిడ్డలు మంటల్లో కాలిపోయారు

మన చేతికి నిప్పు తగిలితేనే అమ్మా అని అంటాం, అలాంటిది ఎల్‌బీ నగర్ చౌరస్తాలో శ్రీకాంతచారి వంటిపై పెట్రోల్ పోసుకుని జై తెలంగాణ అంటూ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు జీవం పోశాడు. తెలంగాణ ఉద్యమం, అమరుల త్యాగాలను ఢిల్లీ పెద్దలు, ఢిల్లీ మీడియా ఏమాత్రం పట్టించుకోకుంటే హైదరాబాద్‌కు కూతవేటులో ఉన్న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పెద్దమంగళారం గ్రామానికి చెందిన యాదిరెడ్డి అనే యువకుడు ఇక్కడి(తెలంగాణ) అమరత్వం దేశానికి తెలియజేయాలని పార్లమెంటు వద్దకు వెళ్ళి తెలంగాణ ఎందుకు కావాలనే వివరాలతో కేంద్రానికి లేఖ రాసి పార్లమెంటుకు కూతవేటు దూరంలో చెట్టుకు ఉరివేసుకుని మరణించాడు. యాదిరెడ్డి శవానికి అనాధ శవంగా పోస్టుమార్టం చేశారు. యాదిరెడ్డి అనాధకాదని, తెలంగాణ బిడ్డ అని మేమంతా అతడి శవాన్ని తీసుకురావడానికి వెళితే దొంగచాటుగా తరలించారు. ఇది మూడు తరాల ఉద్యమం. రాజ్యాంగబద్ధంగా రాష్ట్రపతి శాసనసభకు ముసాయిదా బిల్లు పంపారు. క్రైస్తవులకు బైబిల్, ముస్లింలకు ఖురాన్, హిందువులకు భగద్గీత ఎంత పవిత్రమైనదో.. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు మాకు అంత పవిత్రమైనది. రాష్ట్రపతి పంపిన అలాంటి.. బిల్లును చించి, కాల్చివేశారు. ఇదేనా మీ సంస్కారం? మీ కుట్రలు, కుతంత్రాలను బయటపెట్టారు. బీఏసీ నిర్ణయం మేరకు స్పీకర్ బిల్లు సభలో ప్రవేశపెట్టారు. స్పీకర్ దిష్టిబొమ్మలను సైతం దహనం చేయడం బాధాకరం. సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాజ్యాంగాన్ని కూడా విస్మరించారు. వారి సంకుచిత భావాలను బయటకు వెళ్లగక్కారు. మేం విభజన కోరితే విద్రోహం.. మీరు చేస్తే ఆత్మగౌరవ పోరాటమా?

పొట్టి శ్రీరాములు మాకు ఆదర్శం

‘రాష్ట్రంలో 50% భూభాగం, జనాభాగా ఉన్నాం. అయినా మనం ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండాలా? అని అయ్యదేవర కాళేశ్వరరావు పోరాటం ప్రారంభించారు. 1952 నుంచి 1953 అక్టోబర్ 1న రాష్ట్రం ఏర్పడే వరకు పొట్టి శ్రీరాములు పోరాటం చేశారు. రాష్ట్రం సాధించుకున్నారు. ఆయనే మాకు ఆదర్శం. చిన్న రాష్ట్రాల ఏర్పాటు పోరాటాలకు పునాదులు వేసింది ఆయనే. 1953లో పార్లమెంట్‌లో బిల్లు పెట్టేటప్పుడుసైతం మద్రాసులో సగంప్రాంతం కావాలని గొడవ చేశారు. దీంతో పొట్టి శ్రీరాములు అమరత్వం పొందారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు పొట్టి శ్రీరాములకు సంబంధం లేకుండా చేశారు.

నెహ్రూ మాటలు గుర్తు చేసుకోండి

కేవలం భాష మాత్రమే ఐక్యతకు ప్రాతిపాదిక కాదని ఫజల్ అలీ కమిషన్ చెప్పింది. తెలంగాణను ఆంధ్రాలో కలిపితే వారితో నెగ్గలేరని నెహ్రూకిచ్చిన రిపోర్టులో ఫజల్ అలీ పేర్కొన్నారు. విశాలాంధ్ర ఏర్పాటులో సామ్రాజ్యవాద ఆకాంక్ష ఉందని సాక్షాత్తూ నెహ్రూనే అన్నారు. వీటన్నింటినీ తుంగలోతొక్కి, దురుద్దేశంతో విశాలాంధ్ర ఏర్పాటు చేశారు. విశాలాంధ్రకు మద్దతు ఇచ్చిన గౌతు లచ్చన్న, పుచ్చలపల్లి సుందరయ్య అప్పుడే చెప్పారు. తియ్యని మాటలు కడుపు నింపవు. విశాలాంధ్రకు కొన్ని పెద్దమనుషుల ఒప్పందాలు కావాలన్నారు. ఒప్పందాల మేరకు తెలంగాణను ఆంధ్రా ప్రాంతంలో (మెర్జ్) కలిపారు. ప్రస్తుతం మేం అడుగుతున్నది కొత్త రాష్ట్రం కాదు. డీ మెర్జ్ చేయమంటున్నాం. 1956కు మందున్న రాష్ట్రాన్ని మేం ఇవ్వమంటున్నాం. (ఈ సమయంలో మంత్రి మాణిక్యవరవూపసాద్ జోక్యం చేసుకుంటూ 1956 కంటే ముందు సీమాంధ్రలో ఉన్న భద్రాచలాన్ని మాకిస్తారా? మీ వైఖరి ఏంటి? అని ప్రశ్నించారు. ఇందుకు ఈటెల సమాధానమిస్తూ..) ఆంధ్రాలో ఉన్న సమయంలో కూడా భద్రాచలానికి నిజాం ప్రభువులు శ్రీరామ కళ్యాణానికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు పంపేవారు. ఆ విషయం మరిచిపోవద్దు. తెలంగాణ ప్రాంతానికి చెందిన గోపన్న తహసీల్దార్‌గా ప్రజల సొమ్ముతో భద్రాచలంలో ఆలయాన్ని కట్టించారు. అందుకు గోపన్నను గోల్కొండ కోటలో బంధీఖానాలో పెట్టిన చరిత్రను మరిచిపోవద్దు.

ఒప్పందాలన్నీ బుట్టదాఖలు

1956లో తెలంగాణను మెర్జ్ చేసినప్పుడు చేసుకున్న ఒప్పందాలను సీమాంధ్రులు తుంగలో తొక్కారు. సీమాంధ్ర ప్రాంతం నుంచి సీఎం ఉంటే తెలంగాణ వారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి. తెలంగాణలో ప్రాంతీయ బోర్డును ఏర్పాటు చేసి.. ఆ బోర్డు అనుమతి ఉంటేనే తెలంగాణలోని భూములు అమ్మాలి. కానీ ఈ ఒప్పందాలు ఎక్కడా అమలు కాలేదు. తెలంగాణను మెర్జ్ చేయకముందే ఢిల్లీ నుంచి ఫ్లైట్‌లో బిల్లు రాకముందే తెలంగాణ పదం ఎత్తకుండా నిషేధించారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రంగా ఉన్న పేరులో తెలంగాణను తొలగించారు. రాష్ట్ర అవతరణ సమయంలో డిప్యూటీ సీఎంగా ఉన్న నీలం సంజీవరెడ్డి ఏపీ అవతరణ తర్వాత సీఎం అయ్యారు. కానీ తెలంగాణ ప్రాంతానికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వలేదు. ఉద్యోగాలు, నీళ్లు, నిధులు దోచుకున్నారు. 1969 ఉద్యమం తర్వాత బ్రహ్మానందరెడ్డి కమిటీ వేసి 22,400 తెలంగాణ ప్రాంత ఉద్యోగాలను సీమాంధ్రులు ఆక్రమించుకున్నట్లు తేల్చారు. ఈ మేరకు అప్పటి ప్రభుత్వం 36జీవో విడుదల చేసింది. కానీ ఆ జీవో అమలు చేయలేదు. విశాలాంధ్ర కోరుకున్న పుచ్చలపల్లి సుందరయ్య, రావి సైతం అంగీకరించారు. విశాలాంధ్రకుమద్దతిచ్చాం. కానీ ఉద్యోగాలు దోచుకుంటారని అనుకోలేదని అభిపప్రాయపడ్డారు.

ఒక్క జీవో కూడా అమలు కాలేదు

ఆరు సూత్రాల పథకాన్ని తుంగలో తొక్కారు. ఉద్యోగాలపై 1995లో ఎన్టీఆర్ జయభారత్‌రెడ్డి కమిటీ వేశారు. ఈ కమిటీ రిపోర్టు కూడా ఇచ్చింది. ఎన్టీఆర్ 610 జీవో విడుదల చేశారు. కానీ అమలు కాలేదు. రేవూరి ప్రకాశ్‌రెడ్డితో కమిటీ వేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎం సత్యనారాయణతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. 2004లో గిర్‌గ్లానీ రిపోర్టు ఇచ్చింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన 58,960 ఉద్యోగాలను సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు కొల్ల్లగొట్టారని గిర్‌గ్లానీ చెప్పారు. కానీ ఒక్క ఉద్యోగిని కూడా సీమాంధ్ర ప్రాంతానికి తిప్పి పంపలేదు. ఇంతవరకు 610 జీవో అమలుకు నోచుకోలేదు. సకల జనుల సమ్మె సమయంలో సచివాలయంలో 90% ఉద్యోగులు విధులకు హాజరయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. సచివాలయం, స్టేట్ ఆఫీసుల్లో తెలంగాణకు ఫెయిర్ షేర్ దక్కలేదు. అందుకే తెలంగాణ ఉద్యోగులు సమ్మె చేసినా అంతా సీమాంధ్రులే కాబట్టి విధులకు హాజరయ్యారు. ఇదే ఉదాహరణ. వైఎస్ సమయంలో 610 జీవో అమలు చేయాలని టీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. కానీ అమలు చేయలేదు. అలాంటి ఈ సభ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకునే హక్కులేదు.

రెండు జీవనదులున్నా.. నీటి కరువు

కాకతీయుల కాలంలో తెలంగాణలో చెరువుల పారకం ద్వారా పంటలు పండేవి. ప్రస్తుతం తెలంగాణలో చెరువులే మాయం అయ్యాయి. పొలాలు ఎండిపోతున్నాయి. రెండు జీవనదులు పారే ప్రాంతం ఇది. తెలంగాణలో కృష్ణానది 62 శాతం పారుతుంది. కానీ తెలంగాణకు నీరిస్తున్నది మాత్రం 17.4 శాతమే. గోదావరి 79 శాతం పారుతుంది. కానీ సీమాంధ్ర పాలకులు తెలంగాణకు నీరిస్తున్నది 15.7 శాతమే. నాగార్జున్‌సాగర్ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా నల్లగొండవాసుల పొలాలు మునిగాయి. కానీ నల్లగొండవాసులకు మాత్రం తాగునీరు, సాగునీరు ఇవ్వరు. కానీ సాగర్ కాలువను సీమాంధ్ర ప్రాంతంలోని నూజివీడు వరకు పొడిగించుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జూరాల, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులున్నాయి. కానీ మహబూబ్‌నగర్ వాసులు వలసలు వెళ్ళే పరిస్థితి నెలకొంది. ఎన్టీఆర్, చంద్రబాబులు సీఎంగా ఉండగా పాలమూరును దత్తత తీసుకున్నారు. కానీ ఒక్క పంటకు నీరిచ్చే పరిస్థితి లేదు. వైఎస్ ప్రభుత్వంలో జలయజ్ఞం ప్రారంభించారు. అనుమతులు లేకున్నా పులిచింతల శంకుస్థాపన చేసుకున్నారు. పోతిడ్డిపాడు నిర్మించుకున్నారు. తెలంగాణలో ఏకైక పెద్ద ప్రాజెక్టు ఎస్సారెస్పీ. 14.40 లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఎన్నడూ పూర్తిగా నీరందించలేదు. కరీంనంగర్ దాటి వరంగల్‌కు మంచినీరు అందించే పరిస్థితి లేక కాలువల్లో జిల్లేళ్లు మొలిచాయి. జలయజ్ఞం పేరుతో మాకు లిఫ్టులు, సీమాంధ్రకు అక్రమంగా నీరు తరలిస్తున్నారు. తెలంగాణ రైతులను బిచ్చగాళ్లలా మార్చారు.

సొమ్ము మాది.. సోకులు మీవి

సొమ్ము మాది. సోకులు మాత్రం సీమాంధ్రవి. 55 శాతం బొగ్గు తెలంగాణలో ఉత్పత్తి అవుతోంది. తట్టెడు బొగ్గు పెళ్ళలు కూడా రాయలసీమ, ఆంధ్రా ప్రాంతంలో దొరకవు. శంకర్‌పల్లిలో 1400 మెగావాట్ల గ్యాస్ ఆధారిత ప్లాంటు ఏర్పాటు చేస్తామన్నారు. నేదునూరులో 2100 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. శంకుస్థాపనలకే పరిమితమయ్యారు. సమన్యాయం చేసి రాష్ట్రాన్ని విడగొట్టాలంటున్నారు. ఎక్కడకు పోయింది మీ సమన్యాయం? ఇదేనా మీ ధర్మం. మా దగ్గర బొగ్గు నిల్వలు ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు డిమాండ్ చేశాం ఇదే సభ సాక్షిగా. కానీ తెలంగాణలో విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పలేదు. 55 శాతం బొగ్గు ఉన్నా... 30 శాతం కూడా తెలంగాణలో వాడకంలో లేదు.

విద్యలోనూ తెలంగాణకు అన్యాయమే

మెడికల్ కాలేజీల అంశంలో కూడా సీమాంధ్ర పాలనలో తెలంగాణకు అన్యాయం చేశారు. ప్రభుత్వ కాలేజీలు సీట్లు ఆంధ్రాలో, ప్రైవేటు సీట్లు తెలంగాణ ప్రాంత విద్యార్థులకా? టీఆర్‌ఎస్ ఎంత గగ్గోలు పెట్టినా సీమాంధ్ర పాలకులు పట్టించుకోలేదు. ప్రస్తుతం తెలంగాణ 10 జిల్లాల్లో 6 యూనివర్సిటీలు మాత్రమే ఉన్నాయి. సీమాంధ్రలో మాత్రం జిల్లాకో యూనివర్సిటీ ఉంది. నిజాం నియంతృత్వంతో పాలించారు. ఆ అంశం పక్కన పెడితే తెలంగాణలో ఉస్మానియా మెడికల్ కాలేజీ కట్టించారు. సుమారు 100కు పైగా పరిశ్రమలు ఏర్పాటు చేశారు. కానీ సమైక్యాంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని పరిశ్రమలను మూసివేశారు. తెలంగాణ ప్రాతంలోని భూములన్నీ సీమాంధ్ర పాలకులు అమ్మేశారు. తెలంగాణలో అమ్మిన భూములద్వారా వచ్చిన ఆదాయంలో 10శాతమైనా తెలంగాణలో ఖర్చు పెట్టాలని వైఎస్‌ను అడిగాం. కానీ పట్టించుకోలేదు. చంద్రబాబు హయాంలో హైటెక్ సిటీ పక్కనే ఉన్న తెలంగాణ రైతుల భూములను సీమాంధ్ర సంపన్న వర్గాల ఐటీ కంపెనీలకు కట్టబెట్టారు. నిజంగా తెలంగాణకు గట్టి మేలు తలపెట్టి ఉంటే తెలంగాణ ఉద్యమం వచ్చేది కాదు కదా?

‘న్యాయం’లోనూ అన్యాయమే

విశాలాంధ్రకు ముందు హైదరాబాద్‌లో హైకోర్టు ఉంది. కానీ సీమాంధ్ర జూనియర్ జడ్జిలను హైకోర్టు జడ్జిలుగా ప్రమాణం చేయించారు. దీంతో జూనియర్ల కింద తెలంగాణ సీనియర్ జడ్జిలు పనిచేయాల్సి వస్తోంది. హైకోర్టులో జేసీఏలు 433 మంది ఉండగా ఇందులో సీమాంధ్రులు 307 మంది, తెలంగాణవారు 122 మంది మాత్రమే. ఎస్‌ఈజేలు తెలంగాణవారు 39 మంది ఉంటే సీమాంధ్రులు 139 మంది ఉన్నారు. జిల్లా జడ్జిల్లో తెలంగాణవారు ఆరుగురుంటే 160 మంది సీమాంధ్ర పాంతం వారున్నారు. అందుకే తెలంగాణ న్యాయవాదులు ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. 56 ఏండ్ల చరిత్రలో అడ్వకేట్ జనరల్ పదవి ఒక్క తెలంగాణ వ్యక్తికి కూడా ఇవ్వలేదు. కానీ, ఇటీవల కిరణ్‌కుమార్‌రెడ్డి క్లాస్‌మేట్, జగిత్యాలకు చెందిన సుదర్శన్ రెడ్డికివ్వడం సంతోషమే. (ఈ సమయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటూ.. ‘సుదర్శన్‌రెడ్డి నాతో చదువుకున్న వ్యక్తి మాత్రమే. నా స్నేహితుడు, సన్నిహితుడు కాదు. అయినా తెలంగాణ ప్రాంతానికి చెందిన నలుగురు సీఎంలు ముఖ్యమంత్రులు అయ్యారు.

వారెందుకు నియమించలేదు? తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖులు పీవీ నరసింహారావు దేశానికి ప్రధాని అయ్యారు. ఆయన ఎందుకు నియమించలేకపోయారు’ అని ప్రశ్నించారు. దీనికి ఈటెల స్పందిస్తూ.. తెలంగాణ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రులు పంచలు సదురుకునే వరకే పదవులు లేకుండా చేశారు. మాకు పాలించే అవకాశం ఇచ్చారా? అని ప్రశ్నించారు) ఇన్ని ఉద్యోగాలు దోచుకున్నారు. గత్యంతరం లేకనే కే చంద్రశేఖర్‌రావు తన పదవులకు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ను స్థాపించారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రజలకు, విద్యావంతులకు, విద్యార్థులకు ఎందుకు తెలంగాణ రాష్ట్రం కావాలి అనే అంశాన్ని వివరించాం. తెలంగాణ ఉద్యమంలో వైఎస్ 41 మంది టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఢిల్లీ తీసుకెళ్ళారు.

సోనియాగాంధీని కలిసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సారే తెలంగాణ ఉద్యమానికి ఊతం ఇచ్చారు. 2004లో టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకుని రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇస్తామంటే కేంద్రంలో, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ కూడా మంత్రి పదవులు తీసుకుంది. పోర్టుఫోలియో లేకున్నా కేసీఆర్ తెలంగాణ కోసం త్యాగం చేశారు. (ఈ సమయంలో తెలంగాణ టీడీపీ నేతలు మాట్లాడుతూ ‘పదవులకు ఆశపడి అమ్ముడుపోయారు. మీరు దొంగలు’ అంటూ ఆరోపించారు. ఈటెల సమాధానమిస్తూ.. మీది దొంగల పార్టీనా? మాది దొంగల పార్టీనా ప్రజలే తేలుస్తారు. తెలంగాణలో మీరు జెండా ఎత్తేస్తారా? మేం ఎత్తేస్తామా? ప్రజలే సమాధానం చెబుతారు అన్నారు) కేసీఆర్‌తో పాటు ఐదుగురు ఎంపీలు ఢిల్లీలో గడప గడప తిరిగి, తెలంగాణకు మద్దతు కూడగట్టారు. అందుకే ఎస్‌ఆర్‌సీతో సంబంధం లేకుండా తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సీపీఐ, బీజేపీ ఇప్పటికే చాలాసార్లు తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తామని ప్రకటించాయి. ఈ బిల్లుపై రాష్ట్ర అసెంబ్లీకి అభిప్రాయాలు చెప్పే హక్కు ఉంది. కానీ ఓటింగ్ నిర్వహించే హక్కు లేదు. ఇక సీమాంధ్ర పాలకులకు మిగిలింది కుట్రలు, కుతంత్రాలు మాత్రమే. ఏం చేసి నా తెలంగాణ ఏర్పాటు ఆగదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలమని ఎన్నికల మేనిఫెస్టోల్లో పేర్కొని.. ఆ పార్టీల బీ ఫారమ్‌లతో గెలుపొందిన సీమాంధ్ర ఎమ్మెల్యేలకు వారి పార్టీని ధిక్కరించడం అనైతికం.