Thursday 11 August 2011

వాడు నిర్మించిండా?

ఒక సీమాంధ్ర మూర్ఖ నాయకుడు 1956లో రాళ్ళు, రప్పలుగా ఉన్న హైదరాబాదును తామొచ్చి అభివృద్ధి చేసినమని చెప్తున్నడు. సిగ్గూ షరం లేని ఆ వెధవ వచ్చి, అసెంబ్లీని నిర్మించిండా? వాడు వచ్చి హైకోర్టును కట్టిండా? వాడు ఇన్నాళ్ళు సిగ్గు లేకుండా తాగుతున్న మంచి నీళ్ళను అందిస్తున్న గండిపేట్ జలాశయాన్ని వాడు నిర్మించిండా? ఉస్మానియా, గాంధి హాస్పిటల్స్ వాడు కట్టించిండా? ఆకాశవాణి వాడు పెట్టించిండా? ఉస్మానియా విశ్వవిద్యాలయం, నిజాం కాలేజ్ వాడు వచ్చి కట్టిండా? నాంపల్లి, కాచిగుడా, సికింద్రాబాదు రైల్వే స్టేషన్లు వాడు కట్టించిండా? రాజ్ భవన్, రాష్ట్రపతి నిలయం వాడు నిర్మించిండా? పబ్లిక్ గార్దెన్స్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వాడె గట్టిండా? మింట్ కాంపౌండ్, సాలార్ జంగ్ మ్యూజియమ్, చార్మినార్ ఇవన్నీ వాడె నిర్మించిండా? ఆర్.టి.సి. (అప్పుడు ఆర్.టి.డి.) బస్సులు వాడు స్టార్ట్ చేసిండా? ఎలక్ట్రిసిటి బోర్డ్ వాడె పెట్టిండా? బేగంపెట్ ఏర్ పోర్ట్ వాడె కట్టించిండా? ఇవేవీ 1956లో లేవ? ఆ గుడ్డోడికి ఇవన్ని రాళ్ళూ రప్పలుగ కనిపించినయా? అప్పటికే హైదరాబాద్ ఇండియాలో ఐదవ పెద్ద నగరం ఎట్లయింది మరి .. ఆ పిచ్చోడె చెప్పాలె. హైదరాబాద్ లో చివరి నిజాం కట్టినవన్ని సిగ్గు లేకుండా అనుభవించి ఇట్ల మాట్లాడ్డానికి వాడికి సిగ్గు షరమున్నదా?  పోనీ, నిజాం కట్టిన వాటిలో సగమన్నా వాడి ప్రాంతంలో ఒక్క నగరంలోనైన ఈ అరవయ్యేళ్ళలో కట్టించిండా? తెలంగాణలో ఒక సామెత ఉన్నది - " తన ముడ్డి కడుక్కోలేనోడు వాగును శుభ్రం జేసిన అన్నడట! ". రాళ్ళు రప్పలని మాట్లాడిన ఆ మూర్ఖుడి ప్రాంతాన్ని వాళ్ళోళ్ళే రాళ్ళ సీమ అని చెప్పుకొంటరు. ఆ ప్రాంతంలో ఒక రాజధాని వచ్చి అభివృద్ధి చెందడం వాడికి ఇష్టం లేదు. వాడి బొంద మాత్రం అజీర్తి అయినా ఇంకా నింపుకొంటూనే ఉంటడు. వాడు హైదరాబాదును ఆస్తిగా చూచే నీచుడు.
మేము హైదరాబాదును కన్నతల్లిలా ప్రేమిస్తాం.
1940లలోనే మా కన్న తల్లి వైభవాన్ని చూడరా దరిద్రుడా!
















1 comment:

  1. అసలు వారికి ఏమీలేక టెంట్లలో అసెంబ్లీ నడపడానికి చేతకాకనే గదా ఇక్కడికి వచ్చింది. అప్పుడే వారు ఒక రాజధాని నిరంఇంచుకుంటే ఇప్పటికి ఒక మంచి సిటీ తయారయ్యేదేమో.

    ReplyDelete