Friday 9 August 2013

దోపిడీదార్లమని ఒప్పుకొన్నట్టె కద! సిగ్గు! సిగ్గు!!

పదమూడేళ్ళుగ తెలంగాణ వాళ్ళు సమైక్య రాష్ట్రంలో మా నీళ్ళు, నిధులు, నియామకాలు దోపిడీకి గురవుతున్నయంటే ససేమి కాదని వితండ వాదం చేస్తున్న సీమాంధ్రులు ఇప్పుడు తెలంగాణ ఏర్పడితే నీళ్ళ జగడాలు మొదలవుతయి అంటున్నరు.

 అంటే ఇన్నాళ్ళు నీళ్ళ విషయంలో ఏదొ కిరికిరి ఉన్నట్టె కద!

హైదరాబాదు లేకపోతే మాకు నిధులు సరిపోవు అంటున్నరు. అంటే ఇన్నాళ్ళు నిధుల విషయంలో ఏదొ గడబడ్ చేసినట్టె కద!

మా ఉద్యోగాలకు భద్రత లేదు అంటున్నరు. మా పిల్లలకు ముందు ముందు ఉద్యోగాలు రావు అంటున్నరు. వీధుల్లో పడి విధ్వంసం సృష్టిస్తున్నరు. అంటే ఇన్నాళ్ళు నియామకాల విషయంలో మోసం చేసినట్టె కద!

ఇప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం భారత దేశంలోనే ఉన్నది. రేపు కొత్తగ ఏర్పడె రెండు రాష్ట్రాలు భారత దేశంలోనే ఉంటయి. అప్పుడైన, ఇప్పుడైన భారత రాజ్యాంగానికి లోబడె పని చేస్తయి. మరి్ ఇప్పుడు కొత్తగ రెండు రాష్ట్రాలు ఏర్పడితె, రాజ్యాంగ బద్ధంగ వచ్చేటివి ఎందుకు రావు? అంటే ఇన్నాళ్ళు రాజ్యాంగానికి అతీతంగ అక్రమంగ అవన్ని సీమాంధ్రులు దొబ్బుతున్నట్టె కద! 

ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రాంతం వాళ్ళు వేరొక ప్రాంతం వాళ్ళని EXPLOIT చెయ్యక పోతె .... ఒక ప్రాంతం వాళ్ళు మేం వేరుపడుతం అంటె వేరొక ప్రాంతం వాళ్ళు అంతే పౌరుషంగ "పోతె పొండి. మేం గూడ వేరు పడుతం" అనాలె. ఎందుకంట లేరు?
అసలు తెలంగాణతో విడిపోతె మా బతుకులు కుక్క బతుకులవుతయి అంటున్నరంటే ఇన్నాళ్ళు తెలంగాణను జలగల్లాగ పట్టి పీక్క తిన్నట్టె కద!

ఇంత సిగ్గు, లజ్జ లేకుండ నడి వీధులలో నగ్నంగ నిల్చుని, మేం అరవై ఏళ్ళనుండి దోపిడి చేసినమని చాటుకోడం ఏంది? ఇదంత ఉమ్మడి రాష్ట్ర ముఖ్య మంత్రి సపోర్ట్ చేసుడేంది? సిగ్గు చేటు!

ఏమన్నంటే ... హైదరాబాదుని మేం డెవలప్ జేసినం అంటరు. ఏం? మా తెలంగాణవాళ్ళు టాక్సులు కట్టలేద? ఎప్పుడైన కలిసి ఉన్నప్పుడు అందరు కలిసె కట్టుకొంటరు. విడిపోయినాక ఎవరిది వాళ్ళు కట్టుకొంటరు. ఇది ఒకడు చెప్పాన్నా? సీమాంధ్రుల దిమాఖ్ కెక్కద? 
అయినా ఏం డెవలప్ జేసినరు? లగడపాటి లాంకో హిల్స్ లొ తెలంగాణ పేదోడికేమన్న ఇచ్చినడా? కావూరి కట్టిన రోడ్లలో తెలంగాణ వాళ్ళకి  ఏమన్న టోల్ టాక్స్ ఫ్రీయా? మీ వ్యాపారాలు, మీ డబ్బులు మీరు చూసుకొన్నరు.

మీ సిగ్గు లేని వాదనలు విన్న దేశంలోని అన్ని పార్టీల ముందు మీరు నవ్వులపాలయితెనె గదా.... తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చింది. ఇంకెంత కాలం ఇజ్జత్ తీసుకొంటరు?


1 comment:

  1. Good one!

    ఇజ్జత్ తీసుకునుడు వాళ్ళకున్న పాత అలవాటు.

    ReplyDelete