Thursday, 1 August 2013

అంతర్జాతీయ సమాజం నవ్విపోతోంది.


ఇంకా కొందరు సీమాంధ్రులు కేవలం  బెదిరింపులు, సెంటిమెంట్లకు లొంగి తెలంగాణ ఇచ్చేసారనడం ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణకు ఏ అన్యాయం జరగకుండానే ఇంతమంది జాతీయ పార్టీల నాయకులు తెలంగాణకు మద్దతిచ్చారా? ఏ అన్యాయం జరగకుండానే, లోపల ఇష్టం లేకున్నా మన రాష్ట్ర పార్టీలన్ని బయటికి మద్దతిస్తున్నామని ప్రకటించవలసి వచ్చిందా? వీళ్ళందరి కన్నా సీమాంధ్ర వితండ వాదులు తెలివైనవారా? వీరి వాదన బలమైనదా?
మొన్నటికి మొన్న రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయవలసిన ముఖ్యమంత్రి ఒక్క చిత్తూరు జిల్లా ఉత్సవాలకు 700 కోట్లిచ్చి, 10 తెలంగాణ జిల్లాల కాకతీయ ఉత్సవాలకు 120 కోట్లిచ్చాడు. అదేమిటని హరీష్ రావు అసెంబ్లీలో నిలదీస్తే - "తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వను..  రాసి పెట్టుకో ... " అని అహంకారంతో విర్రవీగలేదా? పాత కాలంలో నడిచి పోయింది గాని, కమ్యునికేషన్లు ఇంతగా అభివృద్ధి చెందాక  ఇదంతా దేశ  నాయకులు, ప్రజలు చూడడం లేదనుకొంటున్నారా ?
బెదిరింపులు, సెంటిమెంట్ల కథలు చెప్పి తెలంగాణను ఆపాలని చూస్తున్నది సీమాంధ్రులు!
కలసి ఉండాలంటే ఇద్దరి అంగీకారం ఉండాలన్నది సాధారణ ప్రజాస్వామిక సూత్రం. నా కిష్టం లేకపోయినా, నువ్వు చచ్చినట్టు నాతో కలసి ఉండాల్సిందే అనడం ఏం న్యాయం?
వీరి మూర్ఖత్వానికి, దౌర్జన్యానికి అంతర్జాతీయ సమాజం నవ్విపోతోంది.


1 comment:

  1. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు!!నా ఇచ్చ యేగాక నాకేటి వెరపు!!

    ReplyDelete