Saturday, 10 August 2013

హైదరాబాద్ తెలంగాణదే!!!


’ఏబిఎన్-ఆంధ్రజ్యోతి’ ఛానల్ ( సీమాంధ్ర ఛానలే ) వారు ’జెస్ట్ వింగ్స్’ సంస్థ వారి అధునాతన సాంకేతిక సహకారంతో హైదరాబాద్ గురించి హైదరాబాద్ ప్రజల ( అన్ని వర్గాలకు చెందిన 5.67 లక్షల మంది ) నుండి జరిపిన ’అభిప్రాయ సేకరణ’లో -
"తెలంగాణకు మాత్రమే హైదరాబాద్ రాజధానిగా ఉండాలి" అన్నవారు = 46.57% మంది.
"హైదరాబాద్ పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉండాలి" అన్నవారు ( "పదేళ్ళు ఉమ్మడి రాజధాని" అంటే... ఆ తరువాత అది పూర్తిగా తెలంగాణకు చెందాలని అంగీకరించినట్టే ) = 20.37% మంది.
వెరసి "హైదరాబాద్ తెలంగాణకే చెందాలి" అని అంగీకరించినవారు మొత్తం = 66.94% మంది.

అంటే "హైదరాబాద్ తెలంగాణకే చెందాలి" అని హైదరాబాద్ లో మూడింట రెండు వంతుల భారీ మెజారిటీ ప్రజలు కోరుకొంటున్నారు.
ఇంక వివాదం ఎక్కడుంది?
ఈ రెఫరెండంను సీమాంధ్రులు గమనించాలి! గౌరవించాలి!!!



No comments:

Post a Comment