Wednesday 17 October 2012

భయం భయంగా ..




భయం భయంగా సాగుతున్నట్టుంది హైదరాబాదులో జరుగుతున్న 'అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు'. ప్రారంభ సదస్సుకు ముందు తెలంగాణ మార్చ్ దెబ్బ ఎక్కడ ఆ సదస్సుపై పడుతుందో అని గజ గజ వణికింది రాష్ట్ర ప్రభుత్వం. నిన్న ఆ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ప్రధాని పర్యటన ఎక్కడ రసాభాస అవుతుందో అని మళ్లీ కుత కుతలాడింది పాపం. ప్రధానిని గగన తలం నుండి దింపి, కార్యక్రమం తరువాత గగన మార్గంలోనే పంపించేసింది. సదస్సులో తెలంగాణ మీడియా ప్రవేశాన్ని నిషేధించి ప్రజాస్వామ్యాన్ని మంట గలిపింది. శాంతియుత నిరసనలను కూడా ఎదురుకొనే ధైర్యం లేని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను చూస్తె జాలి వేస్తోంది.
 అన్యాయంగా అణచివేసేది " భాష ఒక్కటైనా మా జీవన వైవిధ్యాన్ని గుర్తించి ప్రత్యెక రాష్ట్రాన్ని ఇవ్వా"లని కోరే న్యాయబద్ధమైన ఉద్యమాన్ని. జరుపుతున్నది 'జీవ వైవిధ్య సదస్సు'. దయ్యాలు వేదాలను వల్లించినట్టుగా లేదు?   



Saturday 13 October 2012

చెంప పెట్టు


"జై బోలో తెలంగాణ" చిత్రానికి, ఆ చిత్ర దర్శకుడు శంకర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులు ప్రకటించడంతో
తెలంగాణ ఉద్యమంలో న్యాయం లేదని వాదించే వితండవాదుల చెంప ఛెల్లుమనిపించినట్టయింది.