Saturday 29 June 2013

వచ్చి తీరుతది!!!


ఇన్నాళ్ళు మంత్రి పదవి రాంగనే మాట మార్చే తెలంగాణ నేతలను చూసినం.
అందుకే తెలంగాణ రాలేదు!
ఇప్పుడు మంత్రి పదవి రాంగనే మాట మార్చే సీమాంధ్ర నేతల్ని చూస్తున్నం!
తప్పదు! ఇక తెలంగాణ వచ్చి తీరుతది!!

Wednesday 5 June 2013

సమైక్యాంధ్రవాదులారా! దమ్ముందా?


మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు, ఆపైన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నయి.
మళ్ళీ కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పాట ఎత్తుకుంటది. చంద్రబాబులు, జగన్లు తెలంగాణకు మేము వ్యతిరేకం కాదని తొడలు కొట్టుకొంటరు. గులాంనబీ ఆజాదులు, వాయిలార్ రవిలు, షిండేలు గుండెలు గొంతులు చించుకొని నెల రొజుల్లో .. ఇంక ఎక్కువ మాట్లాడితే వారం రోజుల్లో తెలంగాణ అంటరు. కిరణ్ (ఉత్తర కుమార ప్రగల్భాల) రెడ్డిలు అధిష్టానం వంట వండుతున్నదంటరు.  షడెన్గా.. లగడపాటిలకు, టీజీలకు, కావూరిలకు పక్షవా(పా)తం ముదిరి నోళ్ళు పడిపోతయి.
పోని.. రాజకీయ నాయకులంటే నిలువెల్ల అశుద్ధం పూసుకొని అశుద్ధంలో తిరిగి పెరిగె పురుగులు. సమక్యాంధ్రవాదులయిన సీమాంధ్ర ప్రజా సంఘాల నాయకులు,  మేధావులు, జెయెసి నాయకులు, ఉమ్మడి కుటుంబాల ఆదర్శాలు వల్లించె బ్లాగు రచయితలు, సీమాంధ్ర మీడియా... పరకాల ప్రభాకర్లు, నల్లమోతులు .. వీళ్ళకేం రోగం? వీళ్ళు గూడ  అందరంటే అందరు ... ఒక్కసారి గంభీర మౌన ముద్ర దాలుస్తరు. ముక్కులు నోళ్ళు మూసుకొని ఎన్నికలయ్యేదాక బాత్రూమ్లలో, పాయఖానలలో దాక్కొంటరు. తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తరు. అప్పుడు .. అన్నీ తెలంగాణ పార్టీల లెక్కనె కనబడతయి. ఒక్క సమైక్య పార్టీ కూడ చూద్దామన్న కన్పించదు. అన్ని పార్టీలకు ఓటేస్తరు. ఎన్నికలయినాక  మళ్లి సమైక్య పార్టిలన్ని ఒక్కటయితయి. ఆ పార్టీలు తెలంగాణ ఇచ్చుడు దోస పోసినంత, ఉప్మా వండినంత  సులభం కాదు .. అంటయి. అప్పుడు అన్నిసీమాంధ్ర పార్టిల నాయకమ్మణ్యులు హ....హహా...... అని అపహాస్యం చేస్తరు. మళ్ళీ లగడపాటిలకు, టీజీలకు, కావూరిలకు నోళ్ళు కొవ్వుతయి. అడ్డదిడ్డంగ మాట్లాడుడు షురూ జెస్తరు. అప్పుడు మళ్ళీ సమైక్యాంధ్రవాదులు, సీమాంధ్ర ప్రజాసంఘాల నాయకులు, మేధావులు, జెయెసి నాయకులు, ఉమ్మడి కుటుంబాల ఆదర్శాలు వల్లించె బ్లాగు రచయితలు, సీమాంధ్ర మీడియా... పరకాల ప్రభాకర్లు .. బట్టలిప్పుకొని బయటకొస్తరు. మళ్ళీ ఇగ కల్లబొల్లి నీతులు జెప్పుడు జోర్దారుగ నడుస్తది. తెలంగాణ వాదుల్ని తీవ్రవాదులంటరు. దేశద్రోహులంటరు. తాలిబాన్లంటరు. చచ్చెటోళ్ళు చావనీ అంటరు. మేం మంచిగుంటే, మా బొజ్జలు చల్లగుంటే చాలనుకొంటరు. మళ్ళీ ఎన్నికలొచ్చినప్పుడు చూసుకొంటే పాయె అనుకొంటరు. తొమ్మిదేండ్ల నుండి ఇదే తంతు. సిగ్గు.. లజ్జ.. లేదు. ఆత్మాభిమానం అంతకన్న లేదు. నడిరోడ్డులో బట్టలిప్పుకొని నగ్నంగ నాట్యమాడుతున్నరు. రెండు ప్రశాంత  రాష్ట్రాలు సోదర భావంతో ఏర్పడకుండా అడ్డుపడుతున్నరు.  రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రాంత ప్రజల ఆకాంక్షలను, ఉద్యమాలను అప్రజాస్వామికంగా అణగదొక్కుకుంటూ రావణ కాష్టం చేస్తున్నరు.  కొద్ది(లగడ)పాటి తమలాంటి స్వార్థపరుల కోసం మొత్తం  తెలుగువాళ్ళ వినాశనానికి దారి తీస్తున్నరు.
మరి ఇప్పటికైనా... ఈ సమైక్యాంధ్రవాదులు, సీమాంధ్ర ప్రజాసంఘాల నాయకులు, ఈ మేధావులు, ఈ జెయెసి నాయకులు, ఈ ఉమ్మడి కుటుంబాల ఆదర్శాలు వల్లించె బ్లాగు రచయితలు, ఈ సీమాంధ్ర మీడియా... ఈ పరకాల ప్రభాకర్లు.. ఈ   నల్లమోతులు ... నీతికి, నిజాయితీకి నిలబడే వాళ్ళయితే... దమ్ముందా? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో అన్ని సీమాంధ్ర పార్టీల ఎన్నికల మానిఫెస్టోలలో సమైక్యాంధ్ర వాదాన్ని ప్రధాన అంశంగా చేర్ఛెందుకు ఒత్తిడి తేవాలి. దమ్ము.. ధైర్యం ఉంటె... ఏ పార్టీ అయినా, సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా ఆ పార్టిని తిరస్కరించాలని రాష్ట్రమంతా ప్రచారం చెయాలి.  సమైక్యాంధ్రవాదమే ప్రధాన ఎజెండాగా ఈ ఎన్నికలు జరిగేలా కృషి చేసి, ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చె తీర్పును శిరసావహించాలి.
లేదంటే వీళ్ళంతా మనుషుల తోళ్ళు కప్పుకొన్న గుంట నక్కలన్నది స్పష్టం. ప్రజాస్వామ్య వ్యవస్థను మంట గలిపే, మానవత్వం లేని నరరూప రాక్షసులన్నది సుస్పష్టం.