సీమాంధ్రులు సాగిస్తున్న కుహనా సమైక్యాంధ్ర ఉద్యమంలో ఎక్కడ చూచినా పొట్టి శ్రీరాములు గారి ఫ్లెక్సీలే!
ఆయన విగ్రహాలకు పాలాభిషేకాలు!!
ఆయన ఆత్మార్పణతో ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించమని వీర ప్రసంగాలు.. విభజన వాదం వినాశకరమని, ఐకమత్యమే బలమని ఊకదంపుడు ఆదర్శాల ప్రకటనలు...
వీళ్ళ పచ్చి అబద్ధాలకు అంతుందా?
అసలు పొట్టి శ్రీరాములు గారు ఆమరణ ఉపవాస దీక్షకు కూర్చున్నది మద్రాసు రాష్ట్రాన్ని విభజించి, మద్రాస్ నగరంతో కూడిన ఆంధ్ర రాష్ట్రాన్ని (అప్పటికి ఇంకా తెలంగాణ ప్రస్తావనే లేదు) ఏర్పర్చాలని... 19.10. 1952 నాడు.
ఆయన పక్కా విభజన వాది!
ఆయన ఆత్మార్పణ జరిగింది (నిజానికి సీమాంధ్రులు ఆనాడు మద్రాసు తమకు దక్కదని తెలిసీ దురాశతో ఆయన చావును కళ్ళ చూశారు) 15.12.1952 నాడు.
ఆంధ్ర రాష్ట్రం కర్నూల్ రాజధానిగా ఏర్పడింది 01.10.1953 నాడు.
అప్పటికే తెలంగాణ బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఉంది.
ఆ పైన దేశంలో 4వ పెద్ద నగరమైన మద్రాస్ నగరాన్ని సాధించుకోలేకపోయిన సీమాంధ్రులు 5వ పెద్ద నగరమైన హైదరాబాద్ నగరంపై కన్నేసి 3 సంవత్సరాలు లాబీయింగ్ చేశారు.
తెలంగాణ ప్రజలకు ఇష్టం లేకపోయినా ... "పెద్దమనుషుల ఒప్పందం" అంటూ మాయ మాటలు చెప్పి తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంలో కలుపుకొన్నారు.
ఆ విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది పొట్టి శ్రీరాములు గారు గతించిన 4 సంవత్సరాల తరువాత 01.11.1956 నాడు.
ఇదీ చరిత్ర !!!
ఇన్నీ తెలిసీ ... పాఠ్య పుస్తకాల్లో సైతం - "పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది" అని బోధిస్తున్నారంటే ... సీమాంధ్ర పాలకులు, మేధావులు ఎంత అబద్ధాలకోరులో .., కుట్రదారులో చూడండి.
ఉపవాస దీక్షకు కూర్చునే ముందు పొట్టి శ్రీరాములు గారు పత్రికలకు అందించిన బహిరంగ లేఖలోని ఈ ముఖ్య భాగాన్ని చూస్తే చిన్న పిల్లాడికైనా ఈ విషయం అర్థమౌతుంది.
ఇంకా విశదంగా తెలుసుకోవాలంటే ఈ లింకులపై క్లిక్ చేసి చదవండి.
http://aksharsatya.blogspot.in/2013/08/blog-post_8639.html
http://kotiratanalu.blogspot.in/2013/08/blog-post_3317.html
http://kotiratanalu.blogspot.in/2013/08/blog-post_4444.html
http://kotiratanalu.blogspot.in/2013/08/blog-post_27.html
http://kotiratanalu.blogspot.in/2013/08/blog-post_3888.html
("అక్షర సత్యాలు", "కోటి రత్నాల వీణ" బ్లాగర్లకు ధన్యవాదాలతో )