తెలంగాణ నిర్ణయాన్ని కేంద్రం ఆమోదించింది : చాకో
న్యూఢిల్లీ: ‘తెలంగాణ ఏర్పాటుపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదు’ అని ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో అన్నారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ నిర్ణయంపై వెనక్కి వెళ్లే ఆలోచనలేదని స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించిందని వివరించారు. ఇరు ప్రాంతాల్లో పరిస్థితిని చక్కదిద్దుతామని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు చేస్తే సీమాంధ్ర నేతలు రాజీనామాలకు సిద్ధపడుతున్నట్టు సమాచారం ఉందని విలేకరులు ప్రస్తావించగా...ఉద్యమాల ఒత్తిడితో వాళ్లు రాజీనామాలకు సిద్ధపడి ఉండొచ్చని వ్యాఖ్యానించారు.
No comments:
Post a Comment