ఇటీవల "మనవు" అన్న బ్లాగులో రాసిన ఒక పోస్ట్లో ప్రతి మాటా అక్షర సత్యం.
ఆ పోస్ట్ ఇది ....
"సోనియా గాంది, తన పుట్టిన రోజు కానుకగా ఇచ్చిన దానిని వెనుకకు తీసుకుంటుందా !?
K.C.R. గారు ఆంద్రా నాయకులను తెలివిగా అడకత్తెర లో ఇరికించి తెలంగాణా రాష్ట్ర సాధనకు కారకుడయ్యాడు అని చెప్పవచ్చు. తెలంగాణా వారు రాజకీయంగా పావులు కదపటంలో చాణక్యుడికి ఏ మాత్రం తీసి పొరని K.C.R. నిరూపించాడు . అటు అధిష్టాన దేవతని ప్రసన్నం చేసుకోవడంలో సపలిక్రుతుడు అవ్వడమే కాక , తన చాకచక్యంతో ఆమె నైజం ఎరిగి, కూల్ గా ఆమె చేత తెలంగాణాకు o.k అనిపించాడు .. కొన్నాళ్ళు సునామిలా విరుచుకు పడుతూ ,మరి కొన్నాళ్ళు వ్యూహాత్మక మౌనం పాటించే k.c.r. లో అపర చాణక్యుడు ఉన్నాడనటo లో అతి శయోక్తి లేదు .
ఏమిటి ! k.c.r. గారిని ఇంతలా పోగుడుతున్నాను అనుకుంటారా? అవును మరి. ఈ రోజున తెలంగాణా రాష్ట్రం ఏర్పడటానికి ఎవరు ఎన్ని కారణాలు చూపించిన ముక్య కారణం సోనియా గాంది గారి మాట. అవును ఖచ్చితంగా ఆమె తెలంగాణా ప్రజలకు తన పుట్టిన రోజు కానుకగా ఇచ్చిన మాటే ఈ రోజు తెలంగాణా ఏర్పడటానికి కారణ మవుతుంది తప్పా వేరేది కాదు. సోనియా గాంది గారి నైజం ఎరిగిన k.c.r. గారు ఆమె పుట్టిన రోజు అయిన డిసెంబర్ 9 వ తారికున తెలంగాణా ప్రకటన చేసేలా చాలా కసరతు చెసాదు. అందులో బాగమే ఆయన గారి పదిరోజుల నిరాహార దీక్ష కదా కార్యక్రమాలు . ఇవ్వన్ని అధిష్టాన దేవత అంగీకారంతో జరిగినవె. ఆ రోజు భారత హోం మంత్రి చేత ప్రకటన చేయించాక ఇక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అయిపొఇదనుకున్నాదు.
అంతే !అప్పటి దాక తెలంగాణా ఇస్తే మాకేమి అబ్యంతరం లేదని బింకపు మాటలు మాట్లాడిన ఆంద్ర రాజకీయ దిగ్గజాలు ఒక్క సారిగా నివ్వెర పొయారు. అప్పటి దాక తెలంగాణా ఇవ్వడం అనేది అయోధ్యలో రామాలయం కట్టడం లాంటిది అనుకున్న అంద్రా వారు ఒక్కసారిగా ఆంద్రా ప్రజలు నిరసన తెలపడంతో అయోమయానికి గురిఅయి ఒక్క సారిగా మూకుమ్మడి రాజీనామాలు చేసే సరికి ఈ సారి తెల్లబోవడం సోనియా గాంది గారి వంతయింది . అదేమిటి ! అంతకు ఒక్క రోజు మునుపే ఒక్క c.p.m. వారు తప్పా ,అందరూ తెలంగాణా ఇస్తే తమకేమి అబ్యంతరం లేదని రాత పూర్వకంగా తెలియ చేసి ,తెల్లారి ఇచ్చేసరికి ఇలా మాట మార్చడం ఇటాలియన్ సోనియా గారికి అస్సలు అర్ధం కాలెదు. ఈ రోత రాజకీయాలు చూసి ఆమెకు అసహ్యం కూడా వేసి ఉండవచ్చు. కాని రాష్ట్ర రాజకీయాలలో అనుబవమున్న వారు ఇచ్చిన సలహాతో కావచ్చు తాత్కాలికంగా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆపి ఉంటారు
("మనవు" బ్లాగు ఓనర్ కు ధన్యవాదాలతో .....)
సీమాంధ్ర పార్టీల, ఆయా పార్టీల నేతల ద్వంద్వ నీతికి కాంగ్రెస్ అధిష్ఠానం తగిన బుద్ధి చెప్పింది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ!!!
No comments:
Post a Comment