అనేక ఒప్పందాల, జీ.వో.ల ఉల్లంఘననను నిరసిస్తూ,
అరవై ఏళ్ళుగా నిధులు, నీళ్ళు, ఉద్యోగాల పంపకంలో జరుగుతున్న వివక్షను అంతం చేయడానికి
అస్థిత్వ వాదం, ఆత్మ గౌరవం, ప్రజల ఆకాంక్ష అనే ప్రజాస్వామిక అంశాలతో
తెలంగాణవాదులు ఉధృతంగా జరిపిన ఉద్యమ ఫలితంగా
ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే....
సీమాంధ్ర నాయకులు ఓట్లు, సీట్లు, పార్టీ ప్రయోజనాలు అంటూ దొంగ లెక్కల కారణాలు చూపి అడ్డుకొన్నారు. ఇప్పుడు అదే ఓట్లు, సీట్లు, పార్టీ ప్రయోజనాల లెక్కలే చూపుతూ
కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనకు పూనుకొని అప్రతిహతంగా ముందుకు సాగిపోతోంది.
పాపం సీమాంధ్ర నాయకులు! ఇప్పుడేం చేస్తారు?
"కుక్క కాటుకు చెప్పు దెబ్బ" అంటే ఇదే!
No comments:
Post a Comment