Wednesday, 20 November 2013
Sunday, 17 November 2013
Wednesday, 6 November 2013
Monday, 4 November 2013
ఆఖరి బ్రహ్మాస్త్రం కూడ తుస్..స్స్...స్స్.......
సీమాంధ్రుల కొన ఊపిరి ఆశ .. దుర్యోధనుడు, దుశ్శాసనుల ఆఖరి బ్రహ్మాస్త్రం కూడ తుస్..స్స్...స్స్....... అయింది. రాష్ట్ర విభజనకు ఆర్టికల్ 371(d) అడ్డంకి కాదని సాక్షాత్తు హైకోర్టే తేల్చిపారేసింది. ఇక వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళినా హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ, పార్లమెంట్ ఫంక్షనింగ్ కి, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తుందా? ఈ లోపు కావలసిన కార్యం కాస్త సంపూర్ణం అవుతుంది.
స్వార్థపరులు ఎంత పోరాడినా అధర్మం ఏనాటికీ గెలవదు. అందునా ప్రాణాలకు తెగించి పోరాడి గెలిచిన దీర్ఘ కాలపు ధర్మపోరాటానికి దైవబలం ఎక్కువ.
Saturday, 26 October 2013
Monday, 21 October 2013
Thursday, 10 October 2013
ఢిల్లీ పెద్దలకు తెలుగు వారంటే గౌరవం లేదా?
దాదాపు డెబ్బయి రోజులు సమ్మె చేసినా, చివరికి విధ్వంసం సృష్టించినా కేంద్రం తమను కనీసం పట్టించుకోలేదని, పాపం! సీమాంధ్రులు వాపోతున్నారు. అవును.... ఎందుకు పట్టించుకొంటారు?
పదమూడేళ్ళుగా మీ తోటి సోదరులు ఉధృతంగా ఉద్యమం చేస్తుంటే మీరు పట్టించుకొన్నారా? వారి మనసులోని బాధ ఏమిటో తెలుసుకోడానికి ప్రయత్నించారా? సమైక్యంగా ఉండడానికి వారికేం కావాలో కనుక్కొన్నారా? కనీసం జరిగిన తప్పులు సరిదిద్ది, మళ్ళీ ఆ తప్పులు జరగవని హామీ ఇచ్చి అనునయించారా? లేదే!
పైగా.... ఎదురు దాడి చేసి, తెలంగాణ ప్రజలు చెప్పినవన్నీ అబద్ధాలనీ, కళ్ళముందు ఒళ్ళు తగులబెట్టుకొని ప్రాణత్యాగం చేసిన అమరవీరులను గురించి కనీస కారుణ్యం లేకుండా అవహేళన చేశారు.
ఇదంతా ప్రపంచం గమనించలేదా? ఇంత దారుణంగా ప్రవర్తించినవారిని ప్రపంచం గౌరవిస్తుందా?
ఓట్ల కోసం తెలంగాణ ప్రజలను అమాయికులుగా చేసి సీమాంధ్రులు ఆడుకొన్న విషయం అబద్ధమా?
నిన్నొక మాట.... నేడొక మాట.... సీమాంధ్రులు ఆ మాటకొస్తే పూటకొక మాట మార్చిన మాట అబద్ధమా?
ఇన్నాళ్ళు ఏ దోపిడీ జరుగలేదని బుకాయించి, ఇప్పుడు ఆ దోపిడీయే ఆగిపోతే మేం నష్టపోతామనడం అబద్ధమా?
న్యాయం, ధర్మం అన్నది ఆలోచించకుండా కేవలం తమ స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కౌంటరు ఉద్యమాన్ని చేయడం అబద్ధమా?
కేంద్రంలోని ఢిల్లీ పెద్దలకు ఇదంతా అర్థం కాలేదంటారా? ఇంకా వీళ్ళని ఎలా గౌరవిస్తారు?
గౌరవం ఒకరిస్తే తీసుకొనేది కాదు. తమ ప్రవర్తన ద్వారా, వ్యక్తిత్వాల ద్వారా సంపాదించుకొనేది!
ఇంకా ప్రపంచం దృష్టిలో పూర్తిగా పలుచనైపోక ముందే, సీమాంధ్రులు తమ పద్ధతిని మార్చుకొంటే వారికే మంచిది!
Subscribe to:
Posts (Atom)








