Tuesday, 8 October 2013

సిగ్గు లేని జన్మలు ..... !!!

రాష్ట్ర డి.జి.పి. గా ఇటీవలే పదవీ విరమణ చేసిన దినేశ్ రెడ్డి ఈ రోజు .... సి.యం. కిరణ్ కుమార్ రెడ్డి ఆయన సోదరునితో  భూకబ్జాలు చేయించిన విషయం, ఆ విషయాన్ని చూసి చూడనట్టు వదిలేయాలని తనను బెదిరించిన విషయం, తెలంగాణ వస్తే నక్సలిజం పెరుగుతుందని కేంద్రానికి చెప్పమని ఒత్తిడి చేసిన విషయం, తెలంగాణను అడ్డుకొనేందుకు చేసిన ప్రయత్నాల విషయం .... అన్నీ విడమరచి చెప్పి కుండ బద్దలు కొట్టారు.
ఇదీ సీమాంధ్ర సి.యం. గారి ఏలుబడి ..... సమన్యాయం .... !
ఇదిలా ఉంటే .... మాజీ డి.జి.పి. తను పదవిలో ఉండగా ఈ విషయం బయట పెట్టకుండా ఎందుకు సహకరించినట్టు .... ?
ఇదీ ఒక సీమాంధ్ర ఉన్నతాధికారి నిజాయితీ ..... !
వెంటనే సి.యం. ప్రతినిధిగా ఒక సీమాంధ్ర మంత్రి మాట్లాడుతూ ..... నలుగురైదుగురిని పక్కకు తప్పించి సి.యం. గారు డి.జి.పి. పదవిని దినేశ్ రెడ్డికి భిక్షగా వేసినట్టు ప్రకటించి, సి.యం. గారి అవినీతిని మరింత హైలైట్ చేసారు. "అందుకు కనీస కృతజ్ఞత లేకుండా సి.యం. గారి బండారాన్ని బయట పెడతావా?" అని మాజీ డి.జి.పి. ని ఆ మంత్రి ప్రశ్నించారు.
ఇదీ ఒక సీమాంధ్ర మంత్రి బరితెగింపు ..... !
ఇదిగో .... దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకొన్నట్టు .... ఇదీ సీమాంధ్రుల పరిపాలన !
ఇలాంటి పాలన కోసం రాష్ట్రం సమైక్యంగా ఉండాలి ..... ! దానికి తెలంగాణ ప్రజలు సహకరించాలి ..... !!
సిగ్గు లేని జన్మలు ..... !!!




No comments:

Post a Comment