దాదాపు డెబ్బయి రోజులు సమ్మె చేసినా, చివరికి విధ్వంసం సృష్టించినా కేంద్రం తమను కనీసం పట్టించుకోలేదని, పాపం! సీమాంధ్రులు వాపోతున్నారు. అవును.... ఎందుకు పట్టించుకొంటారు?
పదమూడేళ్ళుగా మీ తోటి సోదరులు ఉధృతంగా ఉద్యమం చేస్తుంటే మీరు పట్టించుకొన్నారా? వారి మనసులోని బాధ ఏమిటో తెలుసుకోడానికి ప్రయత్నించారా? సమైక్యంగా ఉండడానికి వారికేం కావాలో కనుక్కొన్నారా? కనీసం జరిగిన తప్పులు సరిదిద్ది, మళ్ళీ ఆ తప్పులు జరగవని హామీ ఇచ్చి అనునయించారా? లేదే!
పైగా.... ఎదురు దాడి చేసి, తెలంగాణ ప్రజలు చెప్పినవన్నీ అబద్ధాలనీ, కళ్ళముందు ఒళ్ళు తగులబెట్టుకొని ప్రాణత్యాగం చేసిన అమరవీరులను గురించి కనీస కారుణ్యం లేకుండా అవహేళన చేశారు.
ఇదంతా ప్రపంచం గమనించలేదా? ఇంత దారుణంగా ప్రవర్తించినవారిని ప్రపంచం గౌరవిస్తుందా?
ఓట్ల కోసం తెలంగాణ ప్రజలను అమాయికులుగా చేసి సీమాంధ్రులు ఆడుకొన్న విషయం అబద్ధమా?
నిన్నొక మాట.... నేడొక మాట.... సీమాంధ్రులు ఆ మాటకొస్తే పూటకొక మాట మార్చిన మాట అబద్ధమా?
ఇన్నాళ్ళు ఏ దోపిడీ జరుగలేదని బుకాయించి, ఇప్పుడు ఆ దోపిడీయే ఆగిపోతే మేం నష్టపోతామనడం అబద్ధమా?
న్యాయం, ధర్మం అన్నది ఆలోచించకుండా కేవలం తమ స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కౌంటరు ఉద్యమాన్ని చేయడం అబద్ధమా?
కేంద్రంలోని ఢిల్లీ పెద్దలకు ఇదంతా అర్థం కాలేదంటారా? ఇంకా వీళ్ళని ఎలా గౌరవిస్తారు?
గౌరవం ఒకరిస్తే తీసుకొనేది కాదు. తమ ప్రవర్తన ద్వారా, వ్యక్తిత్వాల ద్వారా సంపాదించుకొనేది!
ఇంకా ప్రపంచం దృష్టిలో పూర్తిగా పలుచనైపోక ముందే, సీమాంధ్రులు తమ పద్ధతిని మార్చుకొంటే వారికే మంచిది!
well wriiten
ReplyDelete"ఢిల్లీ పెద్దలకు తెలుగు వారంటే గౌరవం లేదా?"
ReplyDeleteఅనుమానమా?
స్వంత పార్టీకి చెందిన మాజీ ప్రధానినే అవమానపరిచినవాళ్ళు సామాన్యులనెలా గౌరవిస్తారు?
ఆయనా మీ ప్రాంతం వాడేనని మరిచిపోకండి. KTR క్లియర్‌గా చెప్పినట్టు, కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణా అంటే ప్రేమా లేదు, సీమాంధ్ర అంటే ద్వేషం లేదు. వాళ్ళ ప్రేమ అంతా మీ ఓట్లమీదే అని గుర్తుపెట్టుకోండి.
Mr.Chandu
ReplyDeleteThank you
Mr.Bonagiri
ReplyDeleteపోస్ట్ లోని అంశాలపై వాదించే సత్తా లేక మీలాంటివాళ్ళు ఇలా డొంక తిరుగుడు కామెంట్లు రాస్తరు. పి.వి. గారు పదవి దక్కినా దక్కకపోయినా స్వాభిమానంతో స్వయంప్రతిపత్తితో పనిచేసే వ్యక్తి. మీ సీమాంధ్ర నాయకుల లాగా గులాంగిరి ఆయనకు చేత కాదు. అందుకని ఆ కోపంతో కేంద్రం ఆనాడు ఆయన బ్రతికుండగా చేయలేని అవమానాన్ని ఆయన చచ్చాక చేసింది.
మరి అప్పుడు అందుకు వత్తాసు పలికిన "తెలుగు" ముఖ్యమంత్రి ఎవరు? ఆయన ఏకైక తెలుగు ప్రధానికి జరుగుతున్న అవమానాన్ని ఎందుకు అడ్డుకోలేదు? ఆ ముఖ్యమంత్రి మరి మీ ప్రాంతం వాడని మీరూ మరచిపోకండి.
ఇదిగో చచ్చిన మనిషితో కూడా మీ సీమాంధ్రులు చేసే గీ కుళ్ళు రాజకీయాల వల్లనే కేంద్రం దృష్టిలో తెలుగువాళ్ళు చులకనయ్యేది మరి! ...... అనే నేనూ చెప్పేది. సమఝయిందా?
కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణపై ప్రేమ ఉందని ఏ తెలంగాణవాడు అనుకోవడం లేదు. ఉంటే పదేళ్ళ నుండి సీమాంధ్రుల దౌర్భాగ్యపు గులాంగిరి లాబీయింగులకు లొంగి తెలంగాణను ఆపేది కాదు. మా వెయ్యిమంది యువకిశోరాలు కాలి బూడిద కాక ముందే తెలంగాణ వచ్చేది.
అలాగే ఈ టైంలో మీ రాజకీయానికి పి.వి. గారి పేరు సాకుగా వాడుకొంటున్నారు గాని, మీకు కూడా పి.వి. గారిపై ప్రేమ ఉందని ఎవ్వడు అన్నా ఎవ్వరు నమ్మరు. ఒకవేళ ఉంటే ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యమంలాంటిది అప్పుడు మీరు కనీసం ఒకటి రెండు రోజులు చేసినా ఢిల్లీలో "పి.వి. ఘాట్" ఏర్పడి ఉండేది.
ఇక "ఓట్ల మీది ప్రేమ" అంటారా? సాటి తెలుగు (తెలంగాణ) వాళ్ళతో మీ సీమాంధ్ర నాయకులే ఓట్ల కోసం ఆటలాడుకొని, ఆపై మాట మార్చినప్పుడు.... ఎక్కడో ఢిల్లీలో కూర్చున్న పరభాషీయులు ఓట్ల కోసం ఆటలాడుకొంటే తప్పేంది భాయ్?
కొంచెం సిగ్గు ఎగ్గుతో ఆలోచించి కామెంట్ పెట్టాలె భాయ్!
"పదమూడేళ్ళుగా మీ తోటి సోదరులు ఉధృతంగా ఉద్యమం చేస్తుంటే మీరు పట్టించుకొన్నారా? వారి మనసులోని బాధ ఏమిటో తెలుసుకోడానికి ప్రయత్నించారా? సమైక్యంగా ఉండడానికి వారికేం కావాలో కనుక్కొన్నారా? కనీసం జరిగిన తప్పులు సరిదిద్ది, మళ్ళీ ఆ తప్పులు జరగవని హామీ ఇచ్చి అనునయించారా? లేదే!"
ReplyDeleteనిక్కము వక్కాణించితిరి! అభినందనలు!
--------------------------------------------------------------
"ఓయి! సీమాంధ్ర సోదరా!
కలసి యుండఁగ వలెనన్నఁ గరుణఁ జూపి,
ప్రేమ కుఱిపించి, కష్టాలఁ బ్రీతిఁ దొలఁగఁ
జేసి, నష్టాలఁ బూడ్చి, విశిష్ట రీతి
వర్తనము సేయఁగా వలె, పరహితులయి!
కలసి యున్నచోఁ గలవు సుఖమ్ములంచుఁ
బలుకఁగా సరిపోదు; ప్రవర్తనమును
మార్చుకోవలె; “సరియ నే మాఱితి” నని
పైఁకిఁ జెప్పి, దౌష్ట్యముఁ జూప ఫలిత మేమి?
అఱువదేండ్లుగ పాలించి, వఱలి మీరు
బాగుపడితిరి! మేము నిష్ఫలిత దుష్ట
దాస్య శృంఖలా బద్ధ విదార హృదిని
బ్రతుకు నీడ్చుచుఁ జచ్చుచు బ్రతికితి మిట!!
న్యాయమే మీకు రాష్ట్రమ్ము నాపు టిదియ?
యాత్మ బలిదాన మెద్ది మీ యాత్మఁ దాఁకెఁ?
గఱుగ లేదె మీ హృదయమ్ము? కర్కశులరె?
యైనచో మీకు మాకుఁబొ త్తయ్య వలదు!! "
-----------------------------------------------------
"ఓయి, తెలంగాణ సోదరా!
నీదు మార్గమ్ము తెలగాణ; నీతి, రీతి,
ఖ్యాతి తెలగాణ; మంత్రమ్ము, ఆశయమ్మ
దియ తెలంగాణ; ధర్మమ్ముఁ దిరుగ నీఁక,
న్యాయమునుఁ దప్పనీఁక; సహాయము నిడి,
సహనమునుఁ బూని, తెలగాణ సాధనమున
నెంద ఱడ్డము వచ్చిన; నెవరు నింద
సేసిన; విని, వినని వాని వేసముఁ గొని,
మన "తెలంగాణ రాష్ట్రమ్ము" మనకు దక్కు
దనుక, మోసకారుల బాస తలను నిడక,
యెల్ల వేళల నప్రమత్తోల్లమునను
రాష్ట్ర సాధనా లక్ష్యమ్ముఁ గ్రాలుచుండఁ,
గృత్యములఁ జేయఁగాను రాష్ట్రేప్సితమ్ము
త్వరితముగ నెఱవేఱు! నీ తపన తీరు!!
గాన, నిన్నిప్పు డుడికించఁ గాను బూను
దుష్ట దుర్మార్గ దుర్నీత దుర్మదాంధ
భాషణము లెప్పుడును నీవు వలచి వలచి,
నా తెలంగాణ సోదరా, నమ్మకుమయ!"
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
(నా తెలంగాణ కోటి రత్నాల వీణ-ratnaalaveena.blogspot.com)
రిపార్టీ అదిరిపోయింది సోదరా! మీ సమాధానం వెటకారంగా, నిర్లక్ష్యంగా, ద్వేషాంచితంగా కామెంట్లు రాసేవాళ్ళకు చెంపపెట్టులా వుంది! సోదరుడు బోనగిరి ఇలా అన్నాడని కాదుగానీ, సీమాంధ్రు లందరికీ ఇలాంటి భావాలే వున్నాయి. కామెంటు రాసేముందు ఆలోచించి రాస్తే ఇలాంటి అనాలోచితాలు చోటుచేసుకోవు. అరవై ఏళ్ళు బానిస బతుకులు బతికిన, బతుకుతున్న... తెలంగాణా వాళ్ళ ననడానికి వాళ్ళకు...అధికారం మా చేతిలోనేవుంది. మమ్మల్నెవరంటారనే చులకన భావమే వాళ్ళచే అలా అనిపిస్తోంది. ఇంకెన్నాళ్ళులే...ముందున్నది ముసుర్ల పండుగ. ఏనాటికైనా రెండు రాష్ట్రాలేర్పడవలసిందే. విడిపోవలసిందే. బాగుపడి చూపించవలసిందే! తెలుగు వాళ్ళం ఒక్కటే అంటే...సీమాంధ్ర తెలుగు వేరే, తెలంగాణా తెలుగు వేరే...ఈ మాత్రం తెలియదు వాళ్ళకు. కేంద్రానికి తెలుగు వాళ్ళంటే గౌరవం లేదంటే...దానర్థం...సీమాంధ్ర తెలుగు వాళ్ళంటే గౌరవం లేదని అర్థం చేసుకోవాలి గానీ...అందరినీ ఒకే గాటన కట్టకూడదుకదా! చిన్నపిల్లవాడు తన అన్న వద్దకు వచ్చి, "అన్నయ్యా! నాన్న నన్ను ’ఒరే చిన్న గాడిదా!’ అన్నాడు." అని చెబితే, అన్నయ్య పెద్ద గాడిద అనే అర్థం వచ్చేట్టున్నాయి...సో. బోనగిరి గారి మాటలు! ఎలాగైతేనేం మాటల్ని తిప్పికొట్టారు. సంతోషం.
ReplyDeleteజై తెలంగాణ! జై జై తెలంగాణ!!
గుండు మధుసూదన్ గారు.
ReplyDeleteThank you Sir.