Saturday, 26 October 2013

అరె.... జర అర్థం జేస్కోండి బయ్!

గిది "ఫేస్ బుక్" లో కనిపించింది. చదివి జర అర్థం జేస్కోండి బయ్!



Thursday, 10 October 2013

ఢిల్లీ పెద్దలకు తెలుగు వారంటే గౌరవం లేదా?


దాదాపు డెబ్బయి రోజులు సమ్మె చేసినా, చివరికి విధ్వంసం సృష్టించినా కేంద్రం తమను కనీసం పట్టించుకోలేదని, పాపం! సీమాంధ్రులు వాపోతున్నారు. అవును.... ఎందుకు పట్టించుకొంటారు?
పదమూడేళ్ళుగా మీ తోటి సోదరులు ఉధృతంగా ఉద్యమం చేస్తుంటే మీరు పట్టించుకొన్నారా? వారి మనసులోని బాధ ఏమిటో తెలుసుకోడానికి ప్రయత్నించారా? సమైక్యంగా ఉండడానికి వారికేం కావాలో కనుక్కొన్నారా?  కనీసం జరిగిన తప్పులు సరిదిద్ది, మళ్ళీ ఆ తప్పులు జరగవని హామీ ఇచ్చి అనునయించారా? లేదే!


పైగా.... ఎదురు దాడి చేసి, తెలంగాణ ప్రజలు చెప్పినవన్నీ అబద్ధాలనీ, కళ్ళముందు ఒళ్ళు తగులబెట్టుకొని ప్రాణత్యాగం చేసిన అమరవీరులను గురించి కనీస కారుణ్యం లేకుండా అవహేళన చేశారు.
ఇదంతా ప్రపంచం గమనించలేదా? ఇంత దారుణంగా ప్రవర్తించినవారిని ప్రపంచం గౌరవిస్తుందా?
ఓట్ల కోసం తెలంగాణ ప్రజలను అమాయికులుగా చేసి సీమాంధ్రులు ఆడుకొన్న విషయం అబద్ధమా?
నిన్నొక మాట.... నేడొక మాట.... సీమాంధ్రులు ఆ మాటకొస్తే పూటకొక మాట మార్చిన మాట అబద్ధమా?
ఇన్నాళ్ళు ఏ దోపిడీ జరుగలేదని బుకాయించి, ఇప్పుడు ఆ దోపిడీయే ఆగిపోతే మేం నష్టపోతామనడం అబద్ధమా?
న్యాయం, ధర్మం అన్నది ఆలోచించకుండా కేవలం తమ స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కౌంటరు ఉద్యమాన్ని చేయడం అబద్ధమా?
కేంద్రంలోని ఢిల్లీ పెద్దలకు ఇదంతా అర్థం కాలేదంటారా? ఇంకా వీళ్ళని ఎలా గౌరవిస్తారు?
గౌరవం ఒకరిస్తే తీసుకొనేది కాదు. తమ ప్రవర్తన ద్వారా, వ్యక్తిత్వాల ద్వారా సంపాదించుకొనేది!
ఇంకా ప్రపంచం దృష్టిలో పూర్తిగా పలుచనైపోక ముందే, సీమాంధ్రులు తమ పద్ధతిని మార్చుకొంటే వారికే మంచిది!




Tuesday, 8 October 2013

సిగ్గు లేని జన్మలు ..... !!!

రాష్ట్ర డి.జి.పి. గా ఇటీవలే పదవీ విరమణ చేసిన దినేశ్ రెడ్డి ఈ రోజు .... సి.యం. కిరణ్ కుమార్ రెడ్డి ఆయన సోదరునితో  భూకబ్జాలు చేయించిన విషయం, ఆ విషయాన్ని చూసి చూడనట్టు వదిలేయాలని తనను బెదిరించిన విషయం, తెలంగాణ వస్తే నక్సలిజం పెరుగుతుందని కేంద్రానికి చెప్పమని ఒత్తిడి చేసిన విషయం, తెలంగాణను అడ్డుకొనేందుకు చేసిన ప్రయత్నాల విషయం .... అన్నీ విడమరచి చెప్పి కుండ బద్దలు కొట్టారు.
ఇదీ సీమాంధ్ర సి.యం. గారి ఏలుబడి ..... సమన్యాయం .... !
ఇదిలా ఉంటే .... మాజీ డి.జి.పి. తను పదవిలో ఉండగా ఈ విషయం బయట పెట్టకుండా ఎందుకు సహకరించినట్టు .... ?
ఇదీ ఒక సీమాంధ్ర ఉన్నతాధికారి నిజాయితీ ..... !
వెంటనే సి.యం. ప్రతినిధిగా ఒక సీమాంధ్ర మంత్రి మాట్లాడుతూ ..... నలుగురైదుగురిని పక్కకు తప్పించి సి.యం. గారు డి.జి.పి. పదవిని దినేశ్ రెడ్డికి భిక్షగా వేసినట్టు ప్రకటించి, సి.యం. గారి అవినీతిని మరింత హైలైట్ చేసారు. "అందుకు కనీస కృతజ్ఞత లేకుండా సి.యం. గారి బండారాన్ని బయట పెడతావా?" అని మాజీ డి.జి.పి. ని ఆ మంత్రి ప్రశ్నించారు.
ఇదీ ఒక సీమాంధ్ర మంత్రి బరితెగింపు ..... !
ఇదిగో .... దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకొన్నట్టు .... ఇదీ సీమాంధ్రుల పరిపాలన !
ఇలాంటి పాలన కోసం రాష్ట్రం సమైక్యంగా ఉండాలి ..... ! దానికి తెలంగాణ ప్రజలు సహకరించాలి ..... !!
సిగ్గు లేని జన్మలు ..... !!!




Thursday, 3 October 2013

జై తెలంగాణ


జై తెలంగాణ
జై తెలంగాణ
జై తెలంగాణ
 జై తెలంగాణ 
జై తెలంగాణ
 జై తెలంగాణ 
జై తెలంగాణ
జై తెలంగాణ