Saturday, 6 August 2011

విశ్వాస ఘాతుకం

పార్లమెంటులో తెలంగాణ ప్రజల ఆవేదనను,ఆకాంక్షను చక్కగా వినిపించినారు జాతీయ ప్రతిపక్ష నేత శ్రీమతి సుష్మా స్వరాజ్. ఇతర భాషకు చెందిన ఆమె అర్థం  చేసుకొన్నంత సాటి తెలుగు వాళ్ళు కొందరు (ముఖ్యంగా సీమాంధ్ర ధనిక, మధ్య తరగతి వర్గం వాళ్ళు) అర్థం చేసుకొనక పోవడం విచిత్రం. ఆమెది స్వంత ప్రయోజనాలు లేని నిష్పాక్షిక దృష్టి మరి. సీమాంధ్ర నాయకులది సంకుచిత స్వార్థ ప్రయోజనాల దృష్టి ఆయె. "ఒక్క సీటు లేని పార్టీ కూడ మాట్లాడుతున్నది" అని వెక్కిరించినాడు కావూరి. ఒక్క సీటు లేక పోయిన అక్కడి పరిస్థితులను వివరించడం జాతీయ  ప్రతిపక్ష నేతగా నా బాధ్యత అని ఆమె గడ్డి పెట్టినారు.


6 comments:

  1. బందులు చేస్తే ఢిల్లీ దిమ్మ తిరుగుద్ది అన్నారు.
    వెర్రి సన్నాసులు ఐనాం కానీ ఢిల్లీ కి వెంట్రుక కూడా ఊడలె !
    రాస్తా రోకో , రైల్ రోకోలు చేస్తే ఢిల్లీ దిమ్మ తిరుగుద్ది అన్నారు.
    మళ్ళీ వెర్రి సన్నాసులు ఐనాం
    మహాగర్జన కి లక్షల మంది వస్తే ఢిల్లీ దిమ్మ తిరుగుద్ది అన్నారు.
    మళ్ళీ వెర్రి సన్నాసులు ఐనాం
    మిలియన్ మార్చ్ చేస్తే ఢిల్లీ దిమ్మ తిరుగుద్ది అన్నారు.
    మళ్ళీ వెర్రి సన్నాసులు ఐనాం
    వంటా వార్పూ చేస్తే ఢిల్లీ దిమ్మ తిరుగుద్ది అన్నారు.
    మళ్ళీ వెర్రి సన్నాసులు ఐనాం
    సహాయ నిరాకరణ చేస్తే ఢిల్లీ దిమ్మ తిరుగుద్ది అన్నారు.
    మళ్ళీ వెర్రి సన్నాసులు ఐనాం
    అందరూ రాజీనామాలు చేస్తే ఢిల్లీ దిమ్మ తిరుగుద్ది అన్నారు.
    మళ్ళీ వెర్రి సన్నాసులు ఐనాం

    గిప్పుడు సకలజనుల సమ్మె అంటున్రు ...చేస్తే ఢిల్లీ దిమ్మ తిరుగుద్ది అంటున్రు .
    ఈసారి పరమ వెర్రి సన్నాసులు ఐతాం
    ఎన్నిసార్లు అయినా ఐతనే ఉంటాం .
    rakthacharithra

    ReplyDelete
  2. ఒరేయ్ రక్త పిపాసి!
    నీ ప్రకారం -
    మంగల్ పాండే మొదటి సిపాయిల తిరుగుబాటు జేసిండు-
    వెర్రి సన్యాసి అయిండు!
    సీతారామరాజు మన్యంలో పోరాడిండు-
    వెర్రి సన్యాసి అయిండు!
    భగత్ సింగ్ బాంబేసిండు -
    వెర్రి సన్యాసి అయిండు!
    గాంధి సహాయ నిరాకరణ జేసిండు
    వెర్రి సన్యాసి అయిండు!
    ఒరే వెధవా!
    ఏ ఉద్యమమయినా అంతేరా!
    అంతిమ విజయ మెప్పుడయినా
    బలవంతులయిన దుర్మదాంధులది కాదురా!
    బలహీనులయిన ఉద్యమకారులదే!!
    ధర్మమేవ జయతే!!!

    ReplyDelete
  3. గదేం మాకు తెలవదు, మాకు బర్రెలం, గొర్రెలం. ఆలోచించనీకి పౌనే దమాగ్ కూడా లేనోళ్ళం. మాది మాగ్గావాలె, గంతనే.

    ReplyDelete
  4. ప్రతి సంవత్సరం మనం వింటున్న మాట !
    2009 - తెలంగాణా సాధన సంవత్సరం ..అబ్బే అవ్వలేదు .
    2010 - తెలంగాణా సాధన సంవత్సరం ..అబ్బా ఇప్పుడు కూడా అవ్వలేదు .
    2011 - తెలంగాణా సాధన సంవత్సరం ..ఛా ! ఈసారి కూడా అయ్యేటట్టు లేదు.
    ఇప్పుడు ఒకేసారి దుమికింది ..
    2014 - తెలంగాణా సాధన సంవత్సరం అంట ..
    2014 కాదు 2114 నాటికి కూడా అవ్వదు .... ఎందుకంటే అది తెలంగాణా సాధన ఉద్యమం కాదు ...సీమంధ్ర వ్యతిరేక ఉద్యమం మాత్రమె కాబట్టి.
    @No Telangana Yaadhav

    ReplyDelete
  5. మహాభారతానికి తెలంగాణా రచ్చకి కొన్ని పోలికలు ఉన్నాయి.
    అప్పటి భారత దేశానికీ మహారాజు "గుడ్డి ధృతరాష్ట్రుడు" ...అయినా పాలించింది , దేశాభివృద్ధి చేసింది పాండురాజు .
    గుడ్డి ధృతరాష్ట్రుడి పిల్లలు కౌరవులు ... పాండురాజు పిల్లలు పాండవులు.
    పాండవుల కోరిక సమైక్యంగా ఉండి దేశాన్ని పాలిద్దామని.
    కౌరవుల కుతంత్రం .... పాండవులని తన్నితరిమి తాము మాత్రమె అనుభవించాలి అని.
    యుద్ధం జరగక తప్పలేదు.
    న్యాయం గెలిచింది ...కుట్ర కుతంత్రాలు చచ్చినాయి
    @No Telangana Yaadhav

    ReplyDelete
  6. ఒరె నల్లి!
    నీకు చరిత్ర చెప్పినోడు, మహాభారతం కథ జెప్పినోడు నీ వ్యాఖ్యలు చూస్తె ఉరి వేసుకొని చస్తరు.
    అంతెందుకురా? మీ నాయనను దేవుడు మీద ఒట్టేసుకొని నువ్వు రాసింది కరెక్టని ఒప్పుకొమ్మను.
    సిగ్గు షరం లేని మాటలెందుకురా? నీకు ఏమన్న న్యాయం, ధర్మం ఆలోచించి, నిష్పాక్షికంగ మాట్లాడె తెలివి ఉన్నద?
    మంచంల దొంగతనంగ దూరి రక్తం బీల్చే చరిత్ర నీది.
    సింహం బొమ్మ పెట్టుకొని కుక్కలాగ మొరిగితె సింహమైపోతావుర?

    ReplyDelete