Sunday, 29 January 2012

TV9 సుమతి! ఎక్కడ బబ్బున్నావు?



టాంక్ బండ్ పై తెలంగాణ వాదులు సీమాంధ్రుల విగ్రహాలను ధ్వంసం చేసిన రోజు " ఉద్యమం పేరిట పైత్యం ప్రకోపించింది .. ఆందోలనకారులు చిల్లర మూకల స్థాయి కన్నా దిగజారారు.. సంస్కారం ఛచ్చిపోయింది.. మానవత్వం మంట గలిసింది.. ” అంటూ గొంతు చించుకొన్న TV9 సుమతి! ఇప్పుడు ఎక్కడ బబ్బున్నావు?
ఆ రోజు లైవ్ ప్రోగ్రాంలో ”నాకెవరైనా సమాధానం చెప్తారా? దీనికి బాధ్యత వహించి ఎవరైనా స్పందిస్తారా?” అంటూ గంగవెర్రులెత్తినావు.
ఆనాడు ఉద్యమ నేపధ్యంలో టాంక్ భండ్ మీద తెలంగాన ప్రముఖుల విగ్రహాలు పెట్టలెదన్న కోపంతో తెలంగాణవాదులు సీమాంధ్రుల విగ్రహాలను పడగొడితే ఆందులో ఒక లాజిక్ ఉంది.
కానీ ఇయ్యాల సీమాంధ్రలో ఏ ఉద్యమం లేదు. ఏ లాజిక్ లేదు. మరి అంభేడ్కర్ విగ్రహాలతోబాటు, ఎన్జీ రంగా, ఎన్టీయార్, వైఎస్సార్, వంగవీటి రంగా .. ఇలా సీమాంధుల విగ్రహాలనె వాల్లె పగలగొడితుంటే .. పెద్ద పెద్ద వాక్యాలు లేవేమి? సన్నాయి నొక్కులు తప్ప. సీమాంధ్ర మీడీయా కళ్ళు దొబ్బాయా? గొంతులు పూడుక పోయినయా? ఉద్యమావేశంలో ఛేసింది ఘోరమైన తప్పా? లేనిపోని దుర్భాషలాడ్తారా? చిల్లర రాజకీయాల కోసం ఛెస్తె ’’నేరస్తులను పోలీసులు వెదుకుతున్నారు” అంటూ మర్యాద భాష వాడ్తారా?
సిగ్గులెని యాంకర్లు .. సిగ్గు షరం లేని మీడియా..

3 comments:

  1. variki kavalasindi telangana varini tittenduku o karanam matrame

    ReplyDelete
  2. variki kavalasindi telangana varini tittenduku o karanam matrame. t v 9 sumathi matrame kadu blogs lo appudu ahakaralu chesina kamma , bramhana blogs lo ippudu ambedkar itara netala vigrahala dweansam pai yelanti ratalu levu

    ReplyDelete
  3. ఆమె ఒక్కర్తే కాదు, ఆనాడు పబ్లిసిటి కోసం గొంతు చించుకొని మస్తుగ అరిచినోల్లు ఎవరూ ఇయ్యాల కనిపిస్తలేరు.

    ReplyDelete