Thursday, 28 February 2013

కుహనా సమైక్యవాదుల నిర్వాకం

ఒక ప్రాంతంవారు మరొక ప్రాంతంపై దుమ్మెత్తి పోసుకొంటూ కలసి ఉండే కన్న, రెండు చిన్న రాష్ట్రాలై పోటాపోటీగా అభివృద్ధి చెందుతామంటున్న తెలంగాణవాదులతో విభేదిస్తూ పోటీగా కల్పిత ఉద్యమాలు చేసి అడ్డుకొంటున్న కుహనా సమైక్యవాదుల నిర్వాకం చూడండి. ఈనాటి " ఈనాడు " లో తాటికాయంత అక్షరాలతో ప్రచురించారు. కడుపు కాలి ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రాంతంవారు ఉద్యమానికి విరామమిస్తే ఇవ్వవచ్చు గాని, విరమించే ప్రసక్తే లేదు. ఇక సమైక్యవాద ప్రభుత్వానికి ఉద్యమం ఎప్పుడు ఎలా లేవదీస్తారా ... దాన్ని ఎలా అణచాలా అని నిరంతరం అదే ధ్యాస తప్ప వేరే ఆలోచనలకు సమయమెక్కడిది? ఫలితం ...  నిఘా వర్గాల దుర్వినియోగం, బాంబు పేలుల్లు, దాన్ని సమైక్యవాదానికి అనువుగా మలుచుకొనే రాజకీయాలు, అటు ఉద్యమాన్ని అణచదానికి, ఇటు భద్రత పేరిటా అదనపు బలగాల  కొరకు నిధులు వ్యర్థం, పెట్టుబడులు వెళ్ళిపోడం, అభివృద్ధి కుంటుపడ్డం..
చివరికి అన్ని ప్రాంతాలు చంకనాకిపోడం... 
గుప్పెడు స్వార్థ సమైక్యవాదుల కోసం ఈ పతనం ఎంతవరకు పోతుందో ఏమో.. కానీయండి.

ఇదీ కుహనా సమైక్యవాదుల నిర్వాకం.