అవహేళన చేయబడ్డవాడు తన మూలాలను పరిశోధించి, తన అస్థిత్వాన్ని వెదుక్కుంటాడు. ఆ అన్వేషణలో తనను అకారణంగా న్యూన పరుస్తున్నారన్న విషయం తేలినప్పుడు నిరసిస్తాడు. తిరుగుబాటు చేస్తాడు. ఉద్యమిస్తాడు. తెలంగాణ ఉద్యమం అలా పుట్టిందే. ఇప్పుడు తెలంగాణలో ప్రతి విద్యావంతుడు అదే పని చేస్తున్నాడు. ఈ రోజు ‘నమస్తే తెలంగాణ‘ దిన పత్రికలో అచ్చయిన ఈ వ్యాసం అందుకు సాక్ష్యం. ( ఈ వ్యాస రచయితకు సీమాంధ్ర వ్యవహార భాషపై ఎలాంటి ద్వేషం లేదు. అందుకు తార్కాణం ఈ వ్యాసం ఆ భాషలో రాయబడడమే.)